Telangana : ఈ నెల 6న బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల..?

ఈ నెల 06 న మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మొత్తం 6,003 అప్లికేషన్లు అందాయని , 40 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న ముఖ్య నేతల స్థానాలకు

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 03:29 PM IST

తెలంగాణ (Telangana) లో మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ తమ అభ్యర్థుల లిస్ట్ (BRS Candidate List) ను ప్రకటించి..ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా, కాంగ్రెస్ , బీజీపీ పార్టీలు సైతం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇప్పటీకే కాంగ్రెస్ మొదటి లిస్ట్ (Congress Candidate List) జాబితా ను సిద్ధం చేయగా..ఇప్పుడు బిజెపి సైతం మొదటి జాబితాను (BJP Candidate List) సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నెల 06 న మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మొత్తం 6,003 అప్లికేషన్లు అందాయని , 40 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న ముఖ్య నేతల స్థానాలకు బీజేపీ మొదటి జాబితాను ఖరారు చేసినట్లు చెపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే మిగతా చోట్ల అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, విజయావకాశాలు, ఇతర పార్టీల నుంచి వచ్చే అవకాశాలున్న బలమైన నేతల పేర్లు తదితర అంశాలపై ముఖ్య నేతలు చర్చిస్తున్నారు. నిన్న (ఆదివారం) దిల్‌ కుష గెస్ట్‌ హౌస్‌లో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇతర సీనియర్‌ నేతలు ఈ భేటీలో పాల్గొ­న్నారు. చాలాచోట్ల నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థుల పేర్లను సూచిస్తూ ఇచ్చిన జాబితాలపై పార్టీ ముఖ్య నేతలు చర్చించినట్లు సమాచారం. జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈనెల 6న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశం అనంతరం అభ్యర్థులను ప్రకటించనున్నారు.

Read Also : Lal Salaam: రజనీ లాల్ సలాం రిలీజ్ కు రెడీ.. ముంబై డాన్ గా తలైవర్