కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి ఘన విజయం (BJP Anji Reddy Wins)సాధించారు. ఎన్నికల కౌంటింగ్ మూడు రోజుల పాటు కొనసాగి, చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి విజేతగా నిలిచారు. మొత్తం 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తైన తర్వాత ఆయన ఆధిక్యంలోకి వచ్చారు. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 73,644 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓటమి ఖరారైన తర్వాత నరేందర్ రెడ్డి కౌంటింగ్ హాల్‌ను వదిలి వెళ్లిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఓట్ల లెక్కింపు నిదానంగా సాగింది. చివరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి రెండో స్థానంలో, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 63,404 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ద్వారా విజయం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. మొత్తం 2,23,343 చెల్లుబాటు అయ్యే ఓట్లలో 1,11,672 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించబడ్డాయి.
Foods To Kidneys: మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్ మీకోసమే!
తెలంగాణ ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి కొమురయ్య విజయం సాధించారు. మొత్తం 25,041 ఓట్లు పోలవగా, 897 ఓట్లు చెల్లని ఓట్లుగా నిర్ధారించబడ్డాయి. కొమురయ్యకు 12,959 ఓట్లు రాగా, పీఆర్‌టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి 7,182 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి గెలవగా, మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ విజయాలు రానున్న ఎన్నికల్లో బీజేపీకి మరింత బలాన్నిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.