Site icon HashtagU Telugu

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్, బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Bihar Election And Jubilee

Bihar Election And Jubilee

మాగంటి గోపినాథ్ మరణం(Maganti Gopinath Dies)తో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ప్రకారం అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అక్టోబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. అక్టోబర్ 21న నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) జరుగుతుంది. అక్టోబర్ 23న ఉపసంహరణకు చివరి రోజు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించనున్నారు. జూబ్లీహిల్స్‌తో పాటు జమ్మూ-కశ్మీర్‌లోని బుద్దాం, నగ్రోటా, రాజస్థాన్‌లోని అంటా, జార్ఖండ్‌లోని ఘఠసిల, పంజాబ్‌లోని తర్న్ తరణ్, మిజోరం‌లోని దంప, ఒడిశా‌లోని నౌపాడ నియోజకవర్గాల్లో కూడా ఇదే తేదీల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

PM Kisan 21st Installment : దీపావళి కానుక.. అకౌంట్లలోకి రూ.2వేలు?

దేశ రాజకీయాల్లో ఎప్పుడూ కాసింత ఉత్కంఠ రేపే రాష్ట్రం బిహార్(Bihar). ఈసారి కూడా అదే తరహా ఆసక్తికర దృశ్యం కనబడనుంది. భారత ఎన్నికల సంఘం బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 6న మొదటి దశ, నవంబర్ 11న రెండవ దశ పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ, బిహార్లో ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు కట్టుబడి నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఉప ఎన్నికల షెడ్యూల్ మరియు బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటనతో దేశ రాజకీయాల్లో వేడి చెలరేగనుంది. జూబ్లీహిల్స్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికలు స్థానిక రాజకీయ సమీకరణాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు బిహార్ ఎన్నికలు జాతీయ స్థాయిలో కీలకంగా పరిగణించబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ బలంగా నిలుస్తుందో, కొత్త సమీకరణాలు ఎలా రూపుదిద్దుకుంటాయో అన్న ఆసక్తి పెరుగుతోంది. కోడ్ అమల్లోకి రావడంతో అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీలు, ప్రతిపక్షాలు సమాన స్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. దీంతో వచ్చే నెలల్లో దేశ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Exit mobile version