Site icon HashtagU Telugu

Etela Rajender: పేపర్ లీక్స్ లో బిగ్ ట్విస్ట్.. ఈటెల టార్గెట్ గా సిట్

Bandi Sanjay Etela Rajender

Bandi Sanjay Etela Rajender

పేపర్ లీకేజీ కేసు బీజేపీ తెలంగాణ అగ్రనేతల చుట్టూ తిరుగుతుంది. రిమాండ్లో ఉన్న సంజయ్ కి బెయిల్ మంజూరు కాగా శుక్రవారం ఈటెల రాజేంద్ర (Etela Rajender) సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఆ మేరకు ఆయనకు గురువారం నోటీస్ లు జారీ చేశారు. ఇంకో వైపు మోడీ హైదరాబాద్ వస్తున్న వేళ నిరసనలకు బీ ఆర్ ఎస్ పిలుపు ఇచ్చింది. ఇరు పార్టీల మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది.

పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌ను ఏ1 నిందితుడిగా చేర్చారు. సంజయ్ ప్రోద్బలంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నపత్రాన్ని పరీక్షకేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సప్‌ ద్వారా సోషల్ మీడియాలో వైరల్‌ చేశారని పోలీసులు అభియోగాలు మోపారు. దీంతో ఆయనపై 120 (బి), 420, 447, 505 (1) (బి) ఐపీసీ, 4 (ఎ), 6, రెడ్‌విత్‌ 8 ఆఫ్‌ టీఎస్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ప్రాక్టీసెస్‌) యాక్ట్‌-1997, సెక్షన్‌ 66-డి ఐటీ యాక్ట్‌-2008 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య రిమాండ్లో ఉన్న ఆయనకు ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి బెయిల్ మంజూరు అయింది. కరీంనగర్ జైలు నుంచి శుక్రవారం ర్యాలీ గా ఆయన్ను బీజేపీ బయటకు తీసుకు రానుంది.

Also Read: IAS Officers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. 8 జిల్లాల కొత్త కలెక్టర్లు వీరే.. !

రిమాండ్‌ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో హనుమకొండ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా పడింది. హై కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్ మేరకు బెయిల్ పిటిషన్ వేయగా సంజయ్ జైలు నుంచి బయటకు వచ్చేలా బెయిల్ మంజూరు అయింది. ఇప్పుడు ఈటెల వ్యవహారం బీజేపీ కి టెన్షన్ పట్టుకుంది. ఆయన్ను కూడా జైలుకు పంపుతారా? అనేది చర్చనీయాంశం అయింది. హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.

పేపర్ లీకేజీకి సంబంధించి (బుధవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్, ఆయన పీఏలు రాజు, నరేందర్‌లకు కూడా క్వశ్చన్ పేపర్ పంపింనట్లు వెల్లడించారు. చాలా మంది బీజేపీ నాయకులకు లీకేజీ సమాచారం వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌కు గురువారం పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నట్లు సమాచారం. ఒక వేళ విచారణకు వెళ్లకపోతే ఆయన్ను అరెస్ట్ చేసి ఛాన్స్ ఉంది. మొత్తం మీద బీజేపీ అగ్రనేతల టార్గెట్ గా పేపర్ లీకేజీ వ్యవహారం తిరుగుతుంది. అరెస్ట్ ల పర్వం సంజయ్ తో ముగుస్తుందా?ఈటెల కూడా జైల్ తప్పదా ? అనేది చూడాలి.