Site icon HashtagU Telugu

Jubilee Hills Bypoll : నవీన్ కు టికెట్ ఇవ్వొద్దంటూ మీనాక్షి నటరాజన్‌ కు లేఖ

Naveen Letter

Naveen Letter

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జరగబోయే ఉపఎన్నికల (Jubilee Hills Bypoll) నేపథ్యంలో నవీన్ అన్న భార్య మహితా చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన భర్త వెంకట్‌ యాదవ్‌, మామయ్య శ్రీశైలం యాదవ్‌ కుటుంబ సభ్యుల చేత అనేక సంవత్సరాలుగా వేధింపులకు గురవుతున్నట్టు పేర్కొంది. ఆమె తెలిపిన ప్రకారం.. వివాహం తర్వాత నుంచి తనపై తీవ్రమైన గృహహింస, వేధింపులు జరుగుతున్నప్పటికీ, న్యాయం కోసం తలుపుతట్టిన ప్రతి సంస్థలోనూ ప్రభావశీలత, రాజకీయ ఒత్తిడుల కారణంగా ఆమెకు న్యాయం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్‌కు 4 గంట‌లపాటు చుక్క‌లు చూపించిన పోలీసులు!

తన భర్త సోదరుడు నవీన్‌ యాదవ్‌ (Naveen yadav) స్థానికంగా బలమైన రాజకీయ, సామాజిక ప్రభావం కలిగిన వ్యక్తి అని. ఆయన తన అధికారాన్ని, సంబంధాలను వాడుకుని కేసులను అణగదొక్కడం, సాక్షులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తాజాగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుండి నవీన్‌ యాదవ్‌కు పార్టీ టికెట్‌ ఇవ్వవచ్చన్న వార్తలు విని తాను తీవ్రంగా కలత చెంది ఉన్నానని తెలిపారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా నిలబడితే ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవుతుందని, మహిళల భద్రత మరింత ప్రమాదంలో పడుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు.

ఇక ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్‌ గారికి లేఖ రాసి, నేరచరిత్ర లేదా హింసాత్మక ప్రవర్తన కలిగిన వ్యక్తులకు రాజకీయ అవకాశాలు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ న్యాయం, సమానత్వం, ప్రజాసేవ వంటి విలువలను పాటించిందని గుర్తుచేస్తూ, అటువంటి విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులను ప్రోత్సహించడం పార్టీ గౌరవానికి నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. మహిళల గౌరవం, సాధారణ ప్రజల భద్రత కోసం న్యాయం జరగాలని, న్యాయవంతమైన నిర్ణయం తీసుకోవాలని ఆమె వినయపూర్వకంగా కోరారు.

Exit mobile version