Big Shock to BRS Party : ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న బిఆర్ఎస్ కీలక నేతలు

మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు

Published By: HashtagU Telugu Desk
Big Shock To Brs

Big Shock To Brs

బిఆర్ఎస్ పార్టీ (BRS Party) నుండి బయటకు వచ్చిన కీలక నేతలంతా ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao), ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham), కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy ) తదితరులు పాల్గొన్నారు.

మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు..తనకు బిఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చినప్పటికీ..తన కొడుక్కు టికెట్ ఇవ్వకపోవడం తో ఆగ్రహం తో బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుండి మెదక్ టికెట్ తన కొడుకు రావడం , అలాగే మైనంపల్లి హన్మంతరావు కు మల్కాజ్గిరి టికెట్ ఓకే అయినట్లు తెలుస్తుంది. అలాగే మిగతా వారికీ కూడా వారి వారి నియోజకవర్గాలలో కాంగ్రెస్ టికెట్ ఖరాయినట్లు సమాచారం. మొత్తం మీద బిఆర్ఎస్ కీలక నేతలంతా కాంగ్రెస్ లో చేరుతుంటే..పార్టీ ఫుల్ జోష్ మీద ఉంది. అయితే నల్గొండ నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరుతుంటే..కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తట్టుకోలేకపోతున్నారు.

తనను సంప్రదించకుండానే.. తన నియోజకవర్గానికి చెందిన నేతలను, అందునా తనపై విమర్శలు చేస్తున్న నేతలను రేవంత్ పార్టీలో చేర్చుకుంటున్నారని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. మొన్నటికి మొన్న వేముల వీరేశం, నిన్న కుంభం అనిల్‌లను పార్టీలో చేర్చుకోవడంపై అలకపాన్పు ఎక్కారట. ప్రధానంగా కుంభం అనిల్ చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. యాదాద్రి DCC అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్ ఇటీవల పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మందుల సామేలును కోమటిరెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

ఆయనే స్వయంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఇటీవల రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి.. పార్టీని వీడిన కుంభం అనిల్‌ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనే స్వయంగా కండువా కప్పి మళ్లీ పార్టీలో చేర్చారు. అయితే, కుంభం అనిల్ పార్టీలో చేరిన విషయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అస్సలు తెలియదట. ఈ విషయంలో మరింత ఆగ్రహంతో ఉన్నారట కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మరి మరి ముందు ముందు ఇంకెంత అలక పాన్పు ఎక్కుతారో కోమటిరెడ్డి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

Read Also : AIMIM Eye AP: ఏపీ రాజకీయాల్లోకి ఎంఐఎం

  Last Updated: 28 Sep 2023, 08:52 PM IST