అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరగా..మరికొంతమంది ఇదే బాటలో రాజీనామా చేస్తూ వస్తున్నారు. తాజాగా సూర్యాపేట (Suryapet) జిల్లా లో భారీ షాక్ తగిలింది.
We’re now on WhatsApp. Click to Join.
కోదాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు (Venepalli Chander Rao) బీఆర్ఎస్‌కు రాజీనామా చేసారు. ఈయనతో పాటు ముగ్గురు ఎంపీపీలు,ముగ్గురు జడ్పీటీసీలు సైతం బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు. బొల్లం మల్లయ్య యాదవ్ ఓటమే లక్ష్యంగా పని చేస్తామని వీరంతా శపథం చేశారు. రేపు ఉత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే నిరంకుశంగా వ్యవహరించారని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నాయకులపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టించడం దారుణమన్నారు. అదిష్టానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారంతా ఆరోపించారు. ఎలాగైనా ఈసారి బొల్లం మల్లయ్య ను ఓడించడమే తమ ధ్యేయం అని తేల్చి చెపుతున్నారు.
ఇదిలా ఉంటె ..జడ్చర్ల లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు బిఆర్ఎస్ లో చేరారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలవాలని ఆకాంక్షిస్తూ ..నవాబుపేట్ మండలంలోని చెన్నారెడ్డి పల్లె, కేశవరావు పల్లె గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దాదాపు 40 మంది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Read Also : Beach Soccer : నేషనల్ గేమ్స్‌లోకి మరో కొత్త ఆట.. ఏదో తెలుసా ?