kapilavai Dilip kumar : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్‌ను రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంచార్జ్‌గా ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి నియమించారు. ఈ సందర్భంగా జయంత్ చౌదరికి కపిలవాయి దిలీప్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీంతో దేశరాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా హస్తం పార్టీలో కొనసాగుతున్న కపిలవాయి పార్టీని వీడటం నిజంగా దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: Congress Govt : రాష్ట్ర ప్రభుత్వానికి ఎర్రబెల్లి సవాల్
కాగా, తెలంగాణ ఉద్యమంలో పని చేసిన దిలీప్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా పని చేశారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాల కారణంగా ఆ పార్టీని వీడారు. అనంతరం పలు రాజకీయ పార్టీల్లో చేరారు. టీజేఎస్, బీజేపీతో పాటు 2014లో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో చేరి ఆ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినా గత కొంత కాలంగా పార్టీలో ఆయనకు పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని దిలీప్ కుమార్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తాను గతంలో పని చేసిన ఆర్ఎల్డీ పార్టీలోనే చేరారు.
Read Also: Bengal : మరోసారి బెంగాల్‌లో చెలరేగిన హింస.. 110 మంది అరెస్ట్