Site icon HashtagU Telugu

BRS : మిర్యాలగూడ లో బిఆర్ఎస్ కు భారీ షాక్

Mgd

Mgd

లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బిఆర్ఎస్ (BRS) సత్తా చాటబోతుందని..ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి ప్రజలు బాధపడుతున్నారని..కాంగ్రెస్ (Congress) వచ్చింది రాష్ట్రానికి కరువు వచ్చిందని..ఈ ప్రభుత్వం ఏడాది కొనసాగితే గొప్పే అని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అంటుంటే..నేతలు మాత్రం మాకు పార్టీ ఫై నమ్మకం లేదని చెప్పి వరుసగా బయటకు వస్తున్నారు. గత మూడు నెలలుగా భారీ ఎత్తున బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుండగా..ఇక ఇప్పుడు ఇంకాస్త ఎక్కువైంది. మరో నెల రోజుల్లో ఖాళీ అవుతుందా ఏంటి అనుకునేలా నేతలంతా బయటకు క్యూ కడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

మిర్యాలగూడ మున్సిపాలిటీ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్‌ దాదాపు 13 మంది కౌన్సిలర్లతో శనివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు తిరునగర్ నాగలక్ష్మీ, మల్గం రమేష్, ఉదయ్ భాస్కర్, పత్తిపాటి సంధ్య, నవాబ్, సలీం, బంటు రమేష్, అమృతం దుర్గ సత్యం, బండ్ల దేవకమ్మ, చీదేళ్ళ సత్యవేణి, సాధిక బేగం, అయోద్య, ఉబ్బపల్లి వెంకమ్మ, కర్ర ఇందిరలు ఉన్నారు. వీరితో పాటు మాజీ మున్సిపాలిటీ ఛైర్మన్ మెరుగు రోషయ్య, మిర్యాలగూడ పీఏసీఎస్ ఛైర్మన్ బంటు శ్రీనివాస్ కూడా ఉన్నారు. 27 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లలో ఛైర్మన్‌తో పాటు 13 మంది ఒకేసారి పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీ ఛైర్మన్ హోదాను కొల్పోనుంది.

ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Read Also : CM Mamata Banerjee: హెలికాప్టర్ లో జారిపడ్డ సీఎం మమతా బెనర్జీ