Site icon HashtagU Telugu

Telangana polls: బీజేపీకి బిగ్ షాక్, నేడు కాంగ్రెస్ లోకి వివేక్ వెంకట్ స్వామి, రేపే మూడో లిస్టు!

vivek venkataswamy joins congress party

vivek venkataswamy joins congress party

Telangana polls: ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది. ఇప్పటికే అసంత్రుప్త నేతలు హస్తం గూటికీ చేరుకుంటున్నారు. అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బాటలో వివేక్ వెంకట్ స్వామి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ ని వివేక్ వెంకట్ స్వామి కలవనున్నారు. రాత్రి ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. ఇక వివేక్ చేరిన తరువాత ఏఐసీసీ రేపు ఉదయం జాబితా విడుదల చేయడానికి సిద్దంగా ఉంది.

కాగా నిన్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ లో వివేక్‌ వ్యవసాయ క్షేత్రానికి రేవంత్ రెడ్డి వెళ్లారు. గన్‌ మెన్‌ కూడా లేకుండా ఒంటరిగా వచ్చిన రేవంత్‌.. దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వివేక్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాల్సిందిగా రేవంత్‌ ఆహ్వానించినట్లు తెలిసింది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అదే సమయంలో వివేక్ పేరు వినిపించినా కూడా ఆయన మాత్రం ఆ పుకార్లను ఖండించారు. తానింకా బీజేపీలోనే ఉన్నానని, ఉంటానని చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే.. రెండ్రోజుల్లోనే టీపీసీసీ అధ్యక్షుడితో ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ లాంఛనం కూడా పూర్తయితే బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడినట్టే లెక్క.

వివేక్ సోదరుడు వినోద్ కి ఆల్రడీ కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. ఇప్పుడు వివేక్ కి కూడా టికెట్ ఇవ్వడం పెద్ద పనేం కాదు. ఆ హామీతోనే రేవంత్ రెడ్డి వివేక్ తో మంతనాలు సాగించినట్టు చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ కీలక నేతలంతా ఇలా బీజేపీకి హ్యాండివ్వడం ఆ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని అంటున్నారు.

Also Read: Delivery Boy: నోయిడాలో దారుణం, ఒంటరిగా ఉన్న యువతిపై డెలివరీ బాయ్ రేప్!