Site icon HashtagU Telugu

Smita Sabharwal : ఐఏఎస్ స్మితా సబర్వాల్‎కు ఊరట.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Smita Sabharwal Tweet

Smita Sabharwal : దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌‌పై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఇవాళ  కొట్టివేసింది. ఆ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో స్మితా సబర్వాల్‌‌కు ఊరట లభించింది. వికలాంగుల కోటా అవసరమా అంటూ స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపాయి. అలా మాట్లాడినందుకు ఆమెపై చాలామంది విమర్శలు చేశారు. రాజకీయ నాయకులు కూడా ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈనేపథ్యంలోనే స్మితా సబర్వాల్‌‌ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు విచారించింది. అయితే దానికి తగిన విచారణార్హత లేదంటూ కొట్టివేసింది.

We’re now on WhatsApp. Click to Join

మహారాష్ట్ర క్యాడర్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌‌ ఉదంతం, యూపీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామాపై ఈ ఏడాది జులైలో ఎక్స్‌ వేదికగా స్మితా సబర్వాల్‌(Smita Sabharwal) ఓ పోస్ట్ చేశారు. ‘‘దివ్యాంగులను అందరూ గౌరవిస్తారు. అయినంత మాత్రాన విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

Also Read :CM Revanth : తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి.. కేంద్రానికి లేఖ రాస్తా : సీఎం రేవంత్

ప్రజల ఫిర్యాదులను ఓపిగ్గా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం కూడా అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటాలు అవసరమా ? నేను కేవలం అడుగుతున్నా’’ అని తన ఎక్స్ పోస్టులో స్మితా సబర్వాల్‌ ప్రశ్నించారు.  అయితే ఈ వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానించేలా,  వారి శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేసేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నత హోదాలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చాలామంది హితవు పలికారు.

Also Read :Vote For Note Case : కవిత బెయిల్‌పై సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు.. గౌరవాన్ని ఆశిస్తున్నామన్న సుప్రీంకోర్టు