రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) విన్నర్ అయ్యాడని..ఆనంద పడాలో..అరెస్ట్ (Pallavi Prashanth Arrest) అయ్యి చంచల్ జైల్లో ఉన్నాడని బాధపడాలో అభిమానులకు అర్ధం కావడం లేదు. బిగ్‌బాస్ -7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకున్న రోజు రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానులు విధ్వంసం సృష్టించారు. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అమర్‌దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. మరో పోటీదారు అశ్వినీ కారు అద్దాలను పగలగొట్టారు. పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు.ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చారు. ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. అయితే ఈ కేసులో ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్‌లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్ ను, అంకిరావుపల్లి రాజును పోలీసులు అంతకుమందే అరెస్టు చేశారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. తాజాగా ప్రశాంత్‌ను అరెస్ట్ చేయడంపై సింగర్, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ భోలె షావళి స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.
‘అతడు మట్టిబిడ్డ, రైతుబిడ్డ. ఎంతో పోరాటం చేసి గెలిచాడు. హౌస్‌లో టాస్కులు ఆడేటప్పుడు ఎన్నో దెబ్బలు తగిలేవి. అన్నా.. ఛాతీ దగ్గర నొప్పి లేస్తుంది, ఏమైనా అయితదా? అన్నా అని అడిగేవాడు. లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి. నీకు మంచి పేరుంది. నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి. నీకోసం పాట పాడటానికి వచ్చాను. నేను హౌస్‌లో లేకున్నా పర్వాలేదు. నేను బయట పాటతో బతుకుతాను. కానీ నువ్వు ఆటతోనే బతకాలి అని చెప్పాను. చివరకు నా పాట, ఆయన ఆట.. అంతా జైలుపాలైంది. చాలా బాధగా ఉంది. జనం స్పందించి ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వరకు తీసుకెళ్లండి అని భోలే అన్నారు. తనకు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదు. తనకంత నాలెడ్జ్ లేదు. తనవల్ల ఇబ్బందులు ఎదురైతే.. పోలీసులకు నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు భోలె షావళి. హైకోర్టు అడ్వకేట్ వినోద్‌ను తన వెంట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన భోలె న్యాయం కోసం పోరాడతానంటున్నాడు.
Read Also : Congress : రేపు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు