Site icon HashtagU Telugu

Bhatti sworn in as Deputy CM : డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం

Bhatti Vikramarka Sworn In

Bhatti Vikramarka Sworn In

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా విజయం సాధించిన మల్లు భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈయనకు ఉప ముఖ్యమంత్రి తో పాటు రెవెన్యూ శాఖా ను కేటాయించారు. మల్లు భట్టివిక్రమార్క 1961, జూన్ 15న మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వైరా మండలం, స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించాడు. విక్రమార్క హైదరాబాదులోని కళాశాల నుండి గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.

మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మధిర శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2009, 2014 ఎన్నికలలో శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2009 నుండి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా ఉన్నాడు, 2011 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశాడు

We’re now on WhatsApp. Click to Join.

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2009లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2009లో చీఫ్ విప్ అయ్యాడు. 2011, జూన్ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీనుండి పోటీచేసి సమీప సి. పి. యం పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 12,329 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచాడు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా నియామకమయ్యాడు.

Read Also : Atchannaidu: రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి: అచ్చెన్నాయుడు