CAG Report : శాసనసభలో కాగ్ నివేదికను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్‌పై కాగ్ నివేదిక సమర్పించారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం అయిందని తెలిపారు. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంగా పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం ఖర్చు అయింది. అదనంగా రూ.1,11,477 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 349 రోజుల పాటు 10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని వినియోగించుకుంది.రూ. 35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు వినియోగించుకుంది ప్రభుత్వం.
Read Also: Salman Vs Lawrence: లారెన్స్ హత్య బెదిరింపులు.. ఫస్ట్ టైం సల్లూ భాయ్ రియాక్షన్
2023-24 ముగిసే వరకు రుణాల మొత్తం రూ. 4,03,664 కోట్లు, జీఎస్డీపీలో అప్పుల శాతం 27గా ఉంది. 2023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం రూ. 2,20,607 కోట్లు. 2023-24 లో తీసుకున్న ప్రభుత్వం 50,528 కోట్లలో 43,918 కోట్లను మూలధనం వ్యయంపై ఖర్చు చేసింది. 2023-24 లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 76,773 కోట్లు.. అంటే గతం కంటే 11 శాతం పెరిగిందన కాగ్ నివేదిక వెల్లడించింది.
2023-24 లో వడ్డీల చెల్లింపుల కోసం రూ. 24,347 కోట్ల వ్యయం అవ్వగా.. వేతనాలకు 26,981 కోట్లు ఖర్చు చేసింది. ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు సమకూరాయి. 2023-24 లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కేవలం రూ. 9934 కోట్లు మాత్రమే. రెవెన్యూ రాబాడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు చేశారు. 2023-24 లో రెవెన్యూ మిగులు రూ. 779 కోట్లుగా నివేదిక అంచనా వేసింది. రెవెన్యూ లోటు 49,977 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.33గా తెలిపింది.
కాగ్ నివేదిక ప్రకారం..
.వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ద్వారా రూ.10,156 కోట్లు తీసుకున్న ప్రభుత్వం
.రూ.35,425 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్‌ను 145 రోజుల పాటు వాడుకుంది
.2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం రూ.24,347 కోట్ల వ్యయం
.వేతనాలకు రూ.26,981 కోట్లు ఖర్చు
.ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు
.2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు మొత్తం రూ.9,934 కోట్లు
.రెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పింఛన్లకే ఖర్చు
.రెవెన్యూ మిగులు రూ.779 కోట్లు
.రెవెన్యూ లోటు రూ.49,977 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.33 శాతం
.2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు
.2023-24 ముగిసే వరకు జీఎస్డీపీలో అప్పులు 27 శాతం
.2023-24 వరకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం రూ.2,20,607 కోట్లు
.2023-24లో మూలధనం కింద రూ.43,918 కోట్ల ఖర్చు
.స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.76,773 కోట్లు
.స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో 11 శాతం పెరుగుదల
Read Also: PM Modi : కశ్మీర్‌లోయలో వందేభారత్..వచ్చే నెలలో ప్రారంభం ?