గత రెండు రోజులుగా తెలంగాణ(Telangana)లో రైతులకు ఉచిత విద్యుత్(Free Power) రచ్చ నడుస్తూనే ఉంది. రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలని BRS నాయకులు రచ్చ చేస్తుండటంతో కాంగ్రెస్ లీడర్స్ అంతా రంగంలోకి దిగి ఉచిత విద్యుత్ ఇస్తాం. మేమే గతంలో కూడా ఉచిత విద్యుత్ ఇచ్చాం అని వరుస ప్రెస్ మీట్స్ పెడుతున్నారు.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్(Congress) నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం అక్కడి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో కూడా ఉచిత విద్యుత్ గురించి మాట్లాడారు.
తిరుమలలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కు. ఉచిత విద్యుత్ పై దేశంలో ఎవరు సాహసం, ఆలోచన చేయనప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ఉమ్మడి రాష్ట్రానికి ఉచిత కరెంటు ఇచ్చారు. తెలంగాణలో 24 లక్షల బోర్లకు పెద్ద ఎత్తున ఉచిత కరెంటు ఉపయోగపడింది. తెలంగాణ రాష్ట్రం ఇపుడు ధనిక రాష్ట్రం, సంపద బాగా ఉన్న రాష్ట్రం, ఇంకా క్వాలిటీ పవర్ తో రాష్ట్ర రైతాంగ సోదరులకు ఉచితంగా కరెంటు ఇస్తాము
తప్ప దానిపై ఒక అడుగు కూడా వెనక్కి వేసేది లేదు. ఉచిత కరెంటు విషయంలో ఎవరికీ సందేహం, ఆందోళన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని బిఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. ఉచిత కరెంటు అంటే గుర్తుకొచ్చేది కాంగ్రెస్ పార్టీనే. వచ్చే ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని అన్నారు.
Also Read : Aadhaar virtual ID: ఇకపై ఆధార్ లేకుండానే ఆ సేవలన్నీ పూర్తి.. ఎలా అంటే?