తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. 17 స్థానాలకు సంబదించిన పోలింగ్ లో ఓటర్లు పెద్దత్తున కాకపోయినా పర్వాలేదు అనిపించేలా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ప్రజలు మాకంటే మాకు మద్దతు తెలిపారని ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)..ఎన్నికల్లో 12 నుండి 14 సీట్లు సాదించబోతున్నామని ధీమా వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని భట్టి తో పాటు, మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) దర్శించుకున్నారు. ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడంతో తన జన్మదన్యమైందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని అర్ధమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ (Congress) గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమికి ప్రజలు ఓట్ల ద్వారా ఆదరణ చూపిస్తున్నారన్నారు. కొన్ని పార్టీలు అన్ని భావజాలాలను పక్కనపెట్టి ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి చూశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రధాని కాబోతున్నారని , ఇండియా కూటమి 300 పైగా సీట్లు సాదించబోతున్నట్లు చెప్పుకొచ్చారు.
Read Also : Ram Charan : బెస్ట్ హస్బండ్ మాత్రమే కాదు బెస్ట్ థెరపిస్ట్ కూడా..!