కూలీ పోయే ఇండ్లలో ఉండొద్దు
చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దు
విద్యుత్ స్తంభాలతో జాగ్రత్త వహించాలి
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు పలు ప్రాంతాల పరిధిలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూలీ పోయే ప్రమాదంలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షిత నివాసాలకు తరలివెళ్లాలని అన్నారు.
అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉండే ఇండ్లలోకి వర్షపునీరు చేరకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు గ్రామ సమీపంలోని చెరువులు, వాగుల వద్ద వెళ్లరాదని, పిల్లలు,యువకులు వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ స్థంబాల వద్దకు, ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు ట్రాన్స్ ఫార్మర్లతో, కరెంటు మోటార్లతో జాగ్రత్త వహించాలని తెలిపారు.
భారీ వర్షం కారణంగా చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. కాబట్టి దయచేసి రోడ్లను గమనించి మీ వాహనాలను సురక్షితంగా నడపండి. సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి. దయచేసి ప్రమాదాలను నివారించండి. అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే డయల్ 100 నెంబర్ కి కాల్ చేయాలని పోలీసులు సూచనలను జారీ చేశారు.
Also Read: Hyderabad Rains: సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ట్రాఫిక్ ఆంక్షలు ఇవే