Fake Doctors : నకిలీ డాక్టర్ల హల్‌చల్.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

వామ్మో.. నకిలీ డాక్టర్లు హల్‌చల్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

  • Written By:
  • Updated On - May 27, 2024 / 01:52 PM IST

Fake Doctors : వామ్మో.. నకిలీ డాక్టర్లు హల్‌చల్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తెలంగాణ వైద్య మండలి అధికారులు హైదరాబాద్ పరిధిలోని ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్‌లలో ఉన్న క్లినిక్‌లలో తనిఖీలు నిర్వహించగా 50 మంది నకిలీ డాక్టర్లు ఉన్నట్లు వెల్లడైంది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ క్లినిక్స్‌ను అధికారులు సీజ్ చేశారు. కొందరు నకిలీ డాక్టర్లు తమ క్లినిక్‌లలో రోగులను చేర్చుకొని.. పెద్ద మోతాదులో యాంటీ బయోటిక్స్ ఇస్తున్నారని గుర్తించారు. ఈ నకిలీ డాక్టర్లు మెడికల్‌ షాపులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు కూడా నడుపుతున్నారని దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం మీద ఇటీవల 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి, ఇద్దరిని జైలుకు పంపారు.

We’re now on WhatsApp. Click to Join

మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్​ లేనివారు.. డాక్టర్లుగా(Fake Doctors) చలామణి అవుతూ ప్రజలకు వైద్యం అందిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.  తెలంగాణ మెడికల్​​ కౌన్సిల్​ నిబంధనల ప్రకారం అర్హత లేనివారు కూడా డాక్టర్లుగా మారుతున్నారు. తమ దగ్గరికి వచ్చే రోగులకు ఇష్టానుసారంగా యాంటీబాడీస్​, స్టెరాయిడ్స్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు మంచి జరగకపోగా.. ప్రాణాలపైకి వస్తోంది. అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లకు సగటున ఏడాది పాటు జైలు శిక్షతో పాటు 5లక్షల వరకు జరిమానా పడుతుందని చట్టం చెబుతోంది.

Also Read :Phone Tapping Case: బీఎల్ సంతోష్‌ను అడ్డంపెట్టుకొని కవితను తప్పించే ప్లాన్.. రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్‌

నకిలీ డాక్టర్లు ఇష్టారాజ్యంగా రోగులకు ఏవి పడితే ఆ మందులను ఇస్తుండటం వల్ల.. వాటిని తిని కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.  అందుకే నకిలీ వైద్యులను అరికట్టే దిశగా తెలంగాణ సర్కారు నడుం బిగించడం చాలా మంచి విషయం.  ఈ దిశగా సీఎం రేవంత్ సర్కారు ముందుకు సాగుతుండటాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఓ వైపు హోటళ్లలో కల్తీ ఆహారాన్ని .. మరోవైపు క్లినిక్‌లలో నకిలీ డాక్టర్ల బాగోతాన్ని బయటపెడుతుండటం మంచి పరిణామమని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Also Read :Actress Hema : రేవ్ పార్టీ కేసు విచారణకు హేమ డుమ్మా.. వైరల్‌ ఫీవర్‌ ఉందంటూ లేఖ