Bomb Threat : బెంగళూరు నగరంలో బాంబ్ బెదిరింపులతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుమ్బలగొడు, కలాసిపాళ్య, రాజరాజేశ్వరి నగర ప్రాంతాల్లో ఉన్న కొన్ని స్కూళ్లకు అనామకుడి నుండి ఈ-మెయిల్ ద్వారా బాంబ్ బెదిరింపు సందేశాలు వచ్చాయి. హైదరాబాద్‌లో జరిగిన అత్యాచార ఘటనపై న్యాయం జరగకపోతే, స్కూల్ భవనాలపై బాంబులతో దాడి చేస్తామని ఈ మెయిల్‌లో పేర్కొనడం, పోలీసులు, పాఠశాలల పాలకుల హడలెత్తించింది.
బెదిరింపు సందేశాలు అందిన వెంటనే, బెంగళూరు పోలీసులు వెంటనే స్కూళ్ల వద్దకు చేరుకొని, బాంబ్ స్క్వాడ్, శ్వానదళంతో కలసి పరిశీలనలు ప్రారంభించారు. పిల్లలను తక్షణమే ఇంటికి పంపించి, పాఠశాలలలోని తరగతులన్నీ ఖాళీ చేయించారు. హాసన్ జిల్లా విద్యాసౌధ పబ్లిక్ స్కూల్, విద్యాసౌధ కిడ్స్ స్కూల్‌లకు కూడా ఇదే తరహా బెదిరింపు ఆదివారం రాత్రి అందింది. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు బాంబు పేలుస్తామంటూ మెయిల్‌లో పేర్కొనడమే కాక, సదరు ఘటనపై న్యాయం జరగకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.
ఇది గత నెలన్నర వ్యవధిలో నమోదైన నాలుగో బాంబ్ బెదిరింపు కావడం గమనార్హం. ఇప్పటికే ఏప్రిల్ 27న బెంగళూరు-వారణాసి ఇండిగో విమానంలో బాంబ్ పెట్టారని ఫేక్ మెసేజ్ రావడం, ఏప్రిల్ 29న సోలదేవనహళ్లిలోని ప్రముఖ ఆచార్య కాలేజీకి బెదిరింపు మెసేజ్ రావడం, ప్రిన్సిపాల్‌ను హత్య చేస్తామని హెచ్చరికలు పంపడం వంటి ఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారాయి.
ఇప్పుడు, హాసన్, బెంగళూరు స్కూళ్లకు వచ్చిన తాజా బెదిరింపులు మరోసారి భద్రతా విభాగాలను అలర్ట్ చేశాయి. పోలీసులు ఈ మెయిల్స్ వెనుక ఉన్న బాధ్యుల్ని గుర్తించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలతో విచారణ ప్రారంభించారు.
ఇటువంటి బెదిరింపుల కారణంగా, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. “పిల్లలు స్కూల్‌కి వెళ్లడం భయంగా మారింది. ప్రతి రోజు ఏదో ఒక బెదిరింపు వార్త వింటున్నాం,” అంటూ తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. పోలీసులు అయితే భద్రతా చర్యలు పటిష్టంగా తీసుకుంటున్నామని, స్కూళ్ల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేస్తామంటున్నారు.
ఇవన్నీ కేవలం వదంతులేనా? లేకపోతే దీని వెనుక కుట్ర ఉందా? అన్న దానిపై త вскsoonప్తంగా విచారణ సాగుతోంది. కానీ బాంబ్ బెదిరింపుల పేరుతో విద్యా వ్యవస్థపై కలిగే ప్రభావం, పిల్లల భద్రతపై లేనిపోని సందేహాలు కలగజేస్తున్నాయి.
Jr. Artist : ప్రేమ పేరుతో జూ.ఆర్టిస్ట్ ను మోసం చేసిన జిమ్ ట్రైనర్.. 15 లక్షలు స్వాహా