తెలంగాణలో మద్యం ప్రియులకు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎండాకాలం ఇంకాపూర్తిగా రానేలేదు..అప్పుడే బీర్ల ధరలను 15 శాతం (Beer Prices Hike) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఈరోజు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పెరిగిన ధరలతో మద్యం వినియోగదారుల పై భారం పడనుంది. బీర్ల సరఫరా సంస్థ యునైటెడ్ బేవరేజెస్ కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేయడం, తాము నష్టాల్లో ఉన్నామని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై విచారణ చేపట్టి, రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బీర్ల సరఫరాదారులకు 15 శాతం ధర పెంపు సిఫారసు చేసింది. సిఫారసు మేరకు తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో వినియోగదారులకు మరింత ఖర్చు పెరగనుండగా, మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగే అవకాశముంది. ఈ నిర్ణయంపై మద్యం వ్యాపారులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
Adani Group : 1000 పడకలతో అదానీ 2 హాస్పిటల్స్ ..ఎక్కడంటే..!!
ఇక మద్యం ధరల పెంపు నిర్ణయం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలులోకి రావడం గమనార్హం. ఏపీలో కూడా లిక్కర్ ధరలను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ మద్యం ప్రేమికులకు తీవ్ర నిరాశ కలిగించిన నిర్ణయంగా మారింది. మరి బీర్ల ధరల పెంపు నేపథ్యంలో మద్యం వినియోగదారులు ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం వల్ల నష్టాల్లో ఉన్న సరఫరాదారులు లాభపడతారని, అలాగే ప్రభుత్వానికి ఆదాయ వృద్ధి చెందుతుందని చెబుతోంది. బీర్ల ధరల పెంపుతో మద్యం మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.