హైదరాబాద్ ఎల్బీ స్టేడియం జనసేన , బీజేపీ , బీసీ కార్యకర్తలతో జనసంద్రంగా మారింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తలపెట్టిన ‘బీసీ ఆత్మగౌరవ సభ’ (BC Atma Gourava Sabha) ఎల్బీ స్టేడియం (LB Stadium) లో నిర్వహిస్తోంది. ఈ సభకు మోడీ (Modi) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు . సభా వేదికగా ప్రధాని పలు కీలక హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికల షెడ్యూల్ అనంతరం ప్రధాని మోడీ సభ ఇదే మొదటిది. గత సభలలో కేంద్రమంత్రి అమిత్ షా బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ఈ సభలో మోడీ నోటి నుంచి కూడా ఆ ప్రకటన వెలువడుతుందని అంత భావిస్తున్నారు. ప్రస్తుతం సభ వేదికపై నేతలు మాట్లాడుతున్నారు. మరోపక్క ఆత్మగౌరవ సభ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బషీర్ బాగ్ నుంచి, ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి, గన్ ఫౌండ్రి నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Read Also : Laxmi Raai : హైదరాబాద్ లో లక్ష్మి రాయ్ సందడి.. అమిగాస్ బార్ & కిచెన్ లాంచింగ్‌లో..