Site icon HashtagU Telugu

Barrelakka Missing : అజ్ఞాతంలోకి బర్రెలక్క ..?

barrelakka missing

barrelakka missing

బర్రెలక్క (Barrelakka ) కనిపించడం లేదు..మొన్నటి వరకు సోషల్ మీడియా లో , ఎన్నికల ప్రచారంలో జోరు చూపించిన బర్రెలక్క ..పోలింగ్ తర్వాత నుండి కనిపించడం లేదు..ప్రస్తుతం ఇదే మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. బర్రెలక్క కనిపించడం లేదని , ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిందని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొల్లాపూర్ లో బర్రెలక్క గెలుపు అవకాశాలు ఉండటంతో పలు పార్టీల నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని..ఆమెను వారే దాచేసారని ఇలా ప్రచారం అవుతుంది. ఈ క్రమంలో ఓ యూట్యాబర్ ఆమెకు కాల్ చేసి ఎక్కడ ఉన్నది తెలుసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తన ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ కావటంతో తాను వరంగల్ వచ్చినట్లు బర్రెలక్క ఆ కాల్‌లో తెలిపింది. తన బెస్ట్ ఫ్రెండ్ యాక్సిడెంట్ గురి కావటంతో హుటహుటిన వరంగల్ వెళ్లాల్సి వచ్చిందని , హాస్పిటల్‌లో ఉండటం వల్లే ఎవరి ఫోన్ లిప్ట్ చేయలేకపోతున్నానని ఫోన్ లో స్పష్టం చేసింది. తాను మిస్సింగ్ అయ్యానన్న వార్తలు అవాస్తమని తేల్చి చెప్పింది. ఒకవేళ తాను మిస్ అయితే తన పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చేవారని … తాను ఎక్కడికి వెళ్లలేదని కావాలనే తనపై కొందరు దుష్ర్పాచారం చేస్తున్నారన్నారు. ఇక తనకు ఏ రాజకీయ పార్టీల నుంచి ఆఫర్స్ రాలేదని కూడా తెలిపింది. తనకే గెలుపు అవకాశాలు ఉన్నాయని.. తాను ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.

Read Also : Black Friday Sale America : అమెరికాలో మొదలైన బ్లాక్‌ ఫ్రైడే సేల్‌..ఆఫర్లు మాములుగా లేవు