Site icon HashtagU Telugu

Bandla Ganesh: కర్ణాటక ఎన్నికలపై ‘బండ్ల’ రియాక్షన్, మోడీ ప్రభుత్వంపై సెటైర్లు!

Bandla

Bandla

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (Bandla Ganesh) టాలీవుడ్ లో ఓ సంచలనం.. సినిమాలతో పాటు ఆయన రాజకీయాల్లోనూ రాణించాలని గతంలో కలలకన్నారు. అయితే ఆయన ఎంత వేగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంట్రీ ఇచ్చారో, అంతే వేగంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినా గణేశ్ ఊహించని విధంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. మళ్లీ చాలా రోజుల తర్వాత ఆయన నోటా రాజకీయ డైలాగ్స్ పేలుతుండటం ఆసక్తిని రేపుతోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్యూహం విజయం సాధించడంతో బండ్ల గణేశ్ వరుస ట్వీట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన ట్వీట్స్ మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించినవే అయినప్పటికీ అందులో పవన్ కళ్యాణ్ సైతం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

తాజాగా మోడీ ప్రభుత్వాన్ని (Modi Govt) టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపింది. ‘మీరు మా రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయిస్తే… కర్ణాటక ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారు.!!’ అంటూ సెటైరికల్‌గా కామెంట్ చేశారు బండ్ల. 4 సంవత్సరాల క్రితం నాటి ఒక ‘క్రిమినల్ పరువు నష్టం’ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునివ్వడంతో, దాన్ని కారణంగా చూపిస్తూ ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత రాహుల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించారు. దాన్నే ఉదహరిస్తూ బండ్ల ఈ ట్వీట్ చేశారు. అంతేకాదు.. మదర్స్ డే రోజు తెలంగాణ తల్లి సోనియాగాంధీ అని ట్వీట్ చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని తెలుస్తోంది.

ఇక అంతకుముందు బండ్ల గణేష్ తన ట్విట్టర్ (Twitter) లో.. నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా. బానిసత్వానికి బాయ్ బాయ్, నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై. రాజకీయాలంటే నిజాయితీ, రాజకీయాలంటే నీతి, రాజకీయాలంటే కష్టం, రాజకీయాలంటే పౌరుషం, రాజకీయాలంటే శ్రమ, రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా అని ట్వీట్ చేశారు.

Also Read: Allu Arjun: మహాభారత్ లో అల్లు అర్జున్.. క్రేజీ అప్‌డేట్ ఇదిగో!

Exit mobile version