Site icon HashtagU Telugu

Bandla Ganesh : రాజకీయాలు వద్దని మళ్ళీ కాంగ్రెస్‌లోకే.. భట్టి పాదయాత్రలో బండ్లన్న..

Bandla Ganesh joined in Bhatti Vikramarka Peoples March and supports to congress

Bandla Ganesh joined in Bhatti Vikramarka Peoples March and supports to congress

బండ్ల గణేష్(Bandla Ganesh) ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం సినిమా ఈవెంట్స్ లో స్పీచ్ లతో, ఇంటర్వ్యూలతో బాగా ఫేమస్ అయ్యారు. గత ఎలక్షన్స్(Elections) ముందు కాంగ్రెస్(Congress) లో చేరి కొన్ని రోజులు హడావిడి చేశారు. కాంగ్రెస్ కి అనుకూలంగా ప్రచారాలు చేసి, ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో బండ్ల గణేష్ MLA గా పోటీచేస్తారని భావించినా చేయలేదు.

కొన్ని అనివార్య కారణాలతో అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు బండ్ల గణేష్. అసలు రాజకీయాల్లోకి రానని, అటు వైపే చూడను అని ఇన్నేళ్లు చెప్పిన బండ్లన్న మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇటీవల కొన్నాళ్ల క్రితం బండ్ల గణేష్ త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తు గురించి చెప్తానని ట్వీట్ చేశారు. అయితే కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చేశారు కదా ఆయన ఫేవరేట్ హీరో పవన్ జనసేనలో చేరుతారేమో అని కొంతమంది భావించారు.

కానీ సడెన్ గా భట్టి విక్రమార్క పాదయాత్రకు వస్తున్నట్టు ప్రకటించి తెలంగాణలో కాంగ్రెస్ రావాలంటూ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర నేడు సూర్యాపేటకు చేరుకుంది. బండ్ల గణేష్ నేడు సూర్యాపేటకు వెళ్లి భట్టి విక్రమార్క పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు కలిసి కొద్ది దూరం పాదయాత్ర చేశారు.

అనంతరం మీడియాతో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. భట్టి విక్రమార్కకు మద్దతు తెలపడం నా అదృష్టం. కాంగ్రెస్ పార్టీ వల్లే భారతదేశం వచ్చింది. ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. సోనియా గాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణలో, సూర్యాపేటలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని అన్నారు. దీంతో బండ్లన్న తిరిగి రాజకీయాల్లోకి వచ్చినట్టు, కాంగ్రెస్ లోనే మళ్ళీ చేరినట్టు క్లారిటీ వచ్చింది. మరి ఈ సారి అయినా బండ్ల గణేష్ MLA గా పోటీ చేస్తాడేమో చూడాలి.

 

Also Read : KTR Delhi Tour: మెట్రో రెండో దశ పనులకు కేంద్రం సాయం కోరిన కేటీఆర్