Site icon HashtagU Telugu

Hyderabad : కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైదరాబాద్ లో ట్రాఫిక్ జాం అనేది ఉండదట..బండ్లన్న ట్వీట్

bandla ganesh comments on hyderabad traffic

bandla ganesh comments on hyderabad traffic

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వార్తల్లో నిలుస్తున్నారు. చిత్రసీమలో అతి తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్న గణేష్…గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరారు. కానీ టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఎన్నికల సమయంలో టీవీ చర్చల్లో.. ప్రెస్‌మీట్‌ల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో కోసుకుంటానని చేసిన కామెంట్స్ గణేష్ ను జాతీయ మీడియా ల్లోనూ హైలైట్ చేసాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress Party) విజయం సాదించకపోవడం తో రాజకీయాలకు దూరమయ్యారు. రీసెంట్ గా మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ (Hyderabad Traffic) ఫై ట్వీట్ చేసి మీడియా లో హైలైట్ అయ్యారు. హైదరాబాద్ (Hyderabad Rains) తో పాటు తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. మాములుగా హైదరాబాద్ లో గంట సేపు వర్షం పడితేనే రోడ్లన్నీ జలమయం అవుతాయి. అలాంటిది గత మూడు రోజులుగా వర్షం పడుతుండడం తో రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ..లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇక ట్రాఫిక్ గురించి ఎంత చెప్పిన తక్కువే…10 కి.మీ ప్రయాణం దాదాపు రెండు గంటలు పడుతుంది. ఆ రేంజ్ లో మూడు రోజులుగా ట్రాఫిక్ కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ హైదరాబాద్ ట్రాఫి‌క్‌పై పొలిటికల్‌గా రియాక్ట్ అయ్యారు. నగరంలో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందిపై ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసారు. “ఇది మన హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ నాలుగు నెలల తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తాం ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలకు చూసుకుంటాం దయచేసి నాలుగు నెలలు భరించండి.” అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ రాజకీయంగా చర్చ గా మారింది. ఈ కామెంట్స్‌పై నెటిజన్లు , బిఆర్ఎస్ శ్రేణులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు . కొందరు మాత్రం బండ్లన్నకు సపోర్టుగానే కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/ganeshbandla/status/1681984833399017474?s=20

Read Also : Thota Chandrasekhar: కేసీఆర్ నాయకత్వం ఏపీ ప్రజలకు అవసరం!