Bandla Ganesh : మల్కాజ్ గిరి కాంగ్రెస్ MP అభ్యర్థిగా బండ్ల గణేష్..?

మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ నిర్మాత బండ్ల గణేశ్ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది

  • Written By:
  • Updated On - February 2, 2024 / 12:52 PM IST

పార్లమెంట్ ఎన్నికల (Parliament Election 2024) నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే..అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ..పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే తరహాలో విజయం సాధించాలని చూస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ కు సంబదించిన నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించి గ్రౌండ్ వర్క్ చేపడుతుంది.

ఈ ఎన్నికలకు సంబంధించి తాజాగా గాంధీ భవన్ (Gandhi Bhavan) లో సమావేశం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ (CM Revanth)..నేతలకు, ఇంచార్జ్ లకి దిశానిర్దేశం చేసారు. అభ్యర్థుల ఎంపిక అనేది అధిష్టానం చూసుకుంటుందని..ప్రస్తుతం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ తరుణంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా (Malkajgiri MP Candidate) సినీ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్ఠానానికి ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ ఆశీస్సులు ఉండటంతో తనకు కచ్చితంగా సీటు వస్తుందని ఆయన భావిస్తున్నట్లు టాక్. కాగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి టాలీవుడ్ నుంచి బండ్ల గణేశ్ ఒక్కరే బహిరంగంగా మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున తన గళం వినిపిస్తూనే ఉన్నారు. మరి గణేష్ కు మల్కాజ్ గిరి టికెట్ ఇస్తారో లేదో చూడాలి.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క బిఆర్ఎస్ సైతం పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతుంది. నిన్న గజ్వేల్ ఎమ్మెల్యే గా మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం బిఆర్ఎస్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ గురించి పార్టీ నేతలకు అధినేత దిశానిర్దేశం చేశారు. నేతలంతా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కేసీఆర్ సూచించారు. అందరి అభిప్రాయాలతో‌నే ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. 6 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలు చెప్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. మరోవైపు.. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాల గురించి చర్చించి, పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ఎవరో ఏదో చెబితే విని ట్రాప్‌లో పడొద్దన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలవటం వల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించారు. అభివృద్ధి కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వండని.. కానీ వాళ్లు ప్రజల్లో ఉన్నప్పుడే ఇవ్వాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు.

Read Also : AP Special Status : ఢిల్లీ జంతమంతర్ వద్ద వైస్ షర్మిల ధర్నా