Site icon HashtagU Telugu

Bandi Sanjay : సీఎం రేవంత్ రెడ్డి ఫై హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay

బిజెపి నేత బండి సంజయ్ (Bandi Sanjay )..సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఫై ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో సీఎం మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్య (Mid Manair victims) గురించి ప్రసావించడం పట్ల బండి సంజయ్ హర్షం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో సీఎం కు సంజయ్ బహిరంగ లేఖ రాసారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని, నీలోజీపల్లి నుంచి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌ను, స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీ (Skill Development College)ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ సహా మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని లేఖలో పేర్కొన్నారు.

Read Also : Buddha Venkanna : కొడాలి నాని నీకు బడితపూజ తప్పదు – బుద్ధా వెంకన్న