కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ అడుగు పెట్టారు. అది కూడా మాములుగా కాదు..కరీంనగర్ గడ్డకు కమాన్ వద్ద ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం చేయడంతో బీజేపీ (BJP) శ్రేణులంతా చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాను గుర్తు చేసుకున్నారు. వారణాసి కి వెళ్లి తిరిగి రాయలసీమలో అడుగుపెట్టిన చిరంజీవి..నేలను తాకి ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పుడు బండి సంజయ్ కూడా అలాగే సాష్టాంగ నమస్కారం చేయడం తో ఒక్కసారిగా అంత చిరంజీవి ని గుర్తు చేసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
జై మోదీ (Jai Modi)… జై జై బండి సంజయ్… జై తెలంగాణ (Jai Telangana).. భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగరు. బండి సంజయ్ రాక తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరావడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. జైజై బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. వినూత్న రీతిలో బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. మీడియా వాహనం ఎక్కి బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు బండి సంజయ్ అభివాదం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో వెళ్లారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి వరించగా, ఈ నెల 13న అక్కడే బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు అభిమానులు, నాయకులు ఢిల్లీ వెళ్లి అభినందనలు తెలిపారు. ఈరోజు కరీంనగర్ కు చేరుకున్నారు. కొండగట్టు అంజన్న క్షేత్రం, నల్లగొండ లక్ష్మీ నరసింహ స్వామి, వేములవాడ రాజన్న, సిరిసిల్ల మార్కండేయ స్వామిని దర్శించుకొని పూజలు చేస్తారని, ఈ నెల 23 వరకు వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.
Read Also : NEET Toppers : ఆరుగురు ‘నీట్’ టాపర్లకు బ్యాడ్ న్యూస్.. కొత్త అప్‌డేట్ ఇదీ