మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తనకు లీగల్ నోటీస్ (Legal Notice) పంపడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఘాటుగా స్పందించారు. నీ తాటాకు చప్పుళ్లకు భయపడనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘నన్ను అవమానిస్తే, నేను బదులిచ్చా. విమర్శలకు నోటీసులే సమాధానమా? అయితే నేను కూడా నోటీసులు పంపిస్తా.. కాచుకో. మాటకు, మాట.. నోటీసుకు నోటీసులతోనే బదులిస్తా’ అని సమాధానం ఇచ్చారు.
కేటీఆర్ నోటీసు (KTR Legal Notice) దీనిగురించి అంటే..
అక్టోబర్ 19వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేసారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారని నోటీసుల్లో పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసుల్లో కేటీఆర్ తెలిపారు.
కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ లాంటి వ్యక్తి చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇష్టానుసారంగా తన పరువునకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయని, దీని కారణంగా ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారంరోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక లీగల్ నోటీసులా..? విమర్శలకు నోటీసులే సమాధానమా.. అంటూ సంజయ్ ప్రశ్నించారు. నేను కూడా నోటీసులు పంపుతా.. కాచుకో. నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చా. మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తా అంటూ ఆయన పేర్కొన్నారు.
Read Also : AP Fee Reimbursement: విద్యార్థులకు నారా లోకేష్ గుడ్ న్యూస్!