హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బోనాల పండుగ సమయంలో ప్రముఖ హిందూ ఆలయమైన పెద్దమ్మ గుడిని(Peddamma Temple) కూల్చివేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన చర్య కాదని, దీని వెనుక కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఇది హిందూ ప్రజల మనోభావాలను కించపరచే చర్యగా అభివర్ణించారు.
Masala Packets : టేస్ట్ కోసం మార్కెట్లో దొరికే ప్యాకెట్ మసాలాలు వాడుతున్న వారికి హెచ్చరిక
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో ఓ ప్రత్యేక వర్గ ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ పూర్వకంగా పెద్దమ్మ గుడిని లక్ష్యంగా తీసుకుని కూల్చివేసిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మధ్యలో చర్చిలు, మసీదులు ఉన్నా వాటిని తాకకుండా గుడిని మాత్రమే కూల్చడం వెనుక కుట్ర ఉందని తీవ్రంగా ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన ఈ చర్యకు జవాబు ఇవ్వడానికి హిందువులు ఐక్యంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు లబ్ధి కలిగించే కుట్ర చేస్తున్నదని బండి సంజయ్ మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్ అసలు ముస్లిం డిక్లరేషన్ అని, బీసీలకు ఐదు శాతం మాత్రమే రిజర్వేషన్ ఇస్తూ మిగిలిన పది శాతం ముస్లింలకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లను బీసీ జాబితా నుంచి తొలగించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం జరిగేలా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.