Telangana BJP: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించారు. బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే తొలి జాబితా సిద్దమైనట్లు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది.
తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం . కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న బండి సంజయ్ బీసీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు సమాచారం . డీకే అరుణ, విజయశాంతి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్లు తొలి జాబితాలో ప్రకటించే అవకాశం లేదు. అంబర్‌పేట, ముషీరాబాద్, గద్వాల్ నియోజకవర్గాలను పెండింగ్‌లో ఉంచారు. సిర్పూర్ పైవ్వల హరీష్, సూర్య పేట్ సంకినేని, భూపాలపల్లి కీర్తిరెడ్డి, జగిత్యాల బి.శ్రావణి, బోధ్ సాయం బాబురావు, హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్, కోరుట్ల నుండి ధర్మపురి అరవింద్, నిర్మల్ మహేశ్వర్ రెడ్డి, దుబ్బాక రఘునందన్ రావు, బాలకొండరావు అన్నపూర్ణమ్మ, కొల్లారావు అన్నపూర్ణమ్మ. కొంతమంది అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో చోటుచేసుకునే అవకాశం ఉంది.
26 మంది బీసీలు, 14 మంది ఎస్సీ ఎస్టీలు, 14 మంది రెడ్డి 11 మంది మహిళలు, ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ప్రకటించే జాబితాలో ఉంటారని చెబుతున్నారు.
Also Read: Cash Seized : ఏఎమ్మార్ గ్రూప్ సంస్థల చైర్మన్ కారులో రూ. 3.50 కోట్లు లభ్యం