Bandi Sanjay : మీది బిచ్చపు బతుకు, ఓట్ల కోసం టోపీలు పెట్టుకుంటారు

Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Bandisanjay Nalgonda

Bandisanjay Nalgonda

Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలది “బిచ్చపు బతుకు” అని, కేవలం ఓట్ల కోసం టోపీలు పెట్టుకుని ఇఫ్తార్ విందులకు వెళ్తారని ఆయన ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, తాను హిందూ ఓటు బ్యాంకుతోనే గెలిచానని బండి సంజయ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కరీంనగర్ పార్లమెంట్ ప్రజలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. “జీవితంలో కనీసం వార్డు మెంబర్‌గానైనా పోటీ చేసి గెలిస్తే ఓటు చోరీ గురించి తెలుస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు,” అని సంజయ్ ధ్వజమెత్తారు. మహేష్ కుమార్ గౌడ్ తీరు గజినీని తలపిస్తోందని, ఒకసారి తనను బీసీ అని, మరోసారి దేశ్‌ముఖ్ అని పిలుస్తూ స్థిరత్వం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Anil Chauhan : ‘సుదర్శన చక్రం’..భారత రక్షణ వ్యవస్థలో మరో విప్లవాత్మక అడుగు

తాను హిందువుల ఓట్లతోనే గెలిచానని, ఈ విషయాన్ని బాహాటంగా చెబుతానని బండి సంజయ్ అన్నారు. “ఎన్నికలు ఉన్నా లేకున్నా మేము హిందువులకు అండగా ఉంటాం. కానీ కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం టోపీలు పెట్టుకుని తిరుగుతారు. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు కూడా ప్రశాంతంగా జరుపుకోలేని దుస్థితిని కల్పించారు. ప్రజలకు లేని ఇబ్బంది ప్రభుత్వానికి ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బలమైన హిందూ ఓటు బ్యాంకును నిర్మిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. “మేము బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అడిగితే, వాళ్ళు ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీ అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా నిలబెడితే వ్యతిరేకించారు. ఇప్పుడు ఓడిపోయే స్థానంలో రెడ్డి అభ్యర్థిని నిలబెట్టారని ఆ వర్గం నేతలు ఆగ్రహంగా ఉన్నారు,” అని పేర్కొన్నారు. తనను తిడితే బ్రేకింగ్ న్యూస్ వస్తుందని కొందరు నేతలు భావిస్తున్నారని, మహేష్ గౌడ్‌కు కాంగ్రెస్ వాళ్లే సెక్యూరిటీ ఇవ్వడం లేదని తనతో చెప్పారని సంజయ్ వ్యాఖ్యానించారు. 2014కు ముందే రోహింగ్యాలు దేశంలోకి వచ్చారని, తెలంగాణలో బీఆర్ఎస్, బెంగాల్‌లో మమతా బెనర్జీ వారికి ఆశ్రయం కల్పించాయని బండి సంజయ్ ఆరోపించారు.

BRS : కోదండరాంపై సీఎం రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరు : దాసోజు శ్రవణ్

  Last Updated: 26 Aug 2025, 12:55 PM IST