Site icon HashtagU Telugu

BRS- Congress : ఒకటైన కాంగ్రెస్..బిఆర్ఎస్ ..?

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ (congress )తో పాటు బీఆర్ఎస్ (BRS) కూడా స్పందించడంతో ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఒకటయ్యాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బండి సంజయ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి.

Maha Kumbh 2025 : భక్తులపై ఎయిర్లైన్స్ దోపిడీ..!

అసలు బండి సంజయ్ ఏమన్నారంటే..రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం అనేది.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే కాబట్టి.. రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లు అని పేరు పెడితే కేంద్రం.. పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణకు ఒక్క ఇళ్లు కూడా ఇవ్వదు అని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే ఇళ్ల నిర్మామానికి మనీ ఇస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యల పై కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పన్నుల రూపంలో నిధులు వెళ్లినా, రాష్ట్రానికి న్యాయం చేయడం లేదని వారు అభిప్రాయపడ్డారు. కేంద్ర పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉందని, వాటి వాటా నిధులు ఉంటాయని, అందుకే రాష్ట్రాల నేతల ఫోటోలు కూడా పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇక బీఆర్ఎస్ కూడా ఈ వ్యాఖ్యలను ప్రతిఘటించింది. కేంద్రం పేరుతో రాష్ట్ర పథకాలను హస్తగతం చేసుకోవడం దారుణమని పేర్కొంది. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటిగా వ్యవహరిస్తున్నట్టు కనిపించడంతో రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఈ పరిణామాలను పరిశీలిస్తున్నారు. ఈ రెండు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఒకే వేదికపైకి వస్తాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి.