Banakacharla : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి వివాదం మరో మలుపు తిరిగింది. బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్న సమావేశానికి సంబంధించి అసలైన బాంబ్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. సమావేశం ఎజెండాలో బనకచర్ల ప్రాజెక్టును చేర్చాలన్న ఏపీ డిమాండ్‌కు తెలంగాణ తేల్చిచెప్పింది.. అది చర్చకు రావాల్సిన అంశం కాదని.
మంగళవారం ఉదయం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాసింది. అందులో బనకచర్ల ప్రాజెక్టును చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే జీఆర్ఎంబీ (గ్రేటర్ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్), సిడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్), ఈఏసీ (ఎన్‌వైరన్‌మెంటల్ అసెస్‌మెంట్ కమిటీ) లాంటి సంస్థలు ఈ ప్రాజెక్టుపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశాయని లేఖలో పేర్కొంది.
ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఏలాంటి నిబంధిత అనుమతులు లేవని, చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అనైతికమని తెలంగాణ అభిప్రాయపడింది. గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం కేంద్ర నియంత్రణ సంస్థల విశ్వసనీయతకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Butter : టిఫిన్స్, కూరల్లో బటర్ అతిగా వాడుతున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
ఇక ఏపీ ఇప్పటికే రేపటి సమావేశానికి సింగిల్ ఎజెండాగా బనకచర్ల అంశాన్ని చేర్చింది. తెలంగాణ–ఏపీ మధ్య నీటి పంచాయితీ వ్యవహారంలో బనకచర్లకు పెద్దపీట వేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తనవైపు నుంచి పంపిన ఎజెండాలో పెండింగ్‌లో ఉన్న కృష్ణా ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపు, ఇచ్చంపల్లి వద్ద కొత్తగా 200 టీఎంసీల వర్షజల వినియోగ ప్రాజెక్టుపై దృష్టిసారించింది.
ఇప్పటికే కేంద్రం నడుపుతున్న జలవనరుల పంచాయితీలో బుధవారం సమావేశం కీలకంగా మారింది. రెండు రాష్ట్రాల సీఎం లు వ్యక్తిగతంగా పాల్గొనబోతుండటంతో, ఈ అంశంపై రాజకీయ వేడి పెరిగింది. ప్రత్యేకంగా బనకచర్ల అంశాన్ని ఏపీ పట్టుబట్టగా, తెలంగాణ మాత్రం దానికి గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో రేపటి సమావేశం లో చర్చ ఏవిధంగా కొనసాగనుందో అన్నది ఆసక్తికరంగా మారింది.