Site icon HashtagU Telugu

Bandi Sanjay: బండి సంజయ్ ఇంట బలగం మూవీ సీన్ రిపీట్.. అల్లుడు లేడని పిట్ట ముట్టలేదు..!

Telangana BJP

Sanjay bandi

తెలంగాణలో ప్రస్తుతం బలగం సినిమా ఫీవర్ నడుస్తోంది. ఏ ఊరిలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా బలగం (Balagam) సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు కలుసుకున్న బలగంలోని సన్నివేశాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా చాలా మందికి కనెక్ట్ అయ్యింది. బంధాలు, బంధుత్వమే మా ‘బలగం’ అనే సందేశాన్ని ఇచ్చే ఈ సినిమా భావోద్వేగాలకు జనాలు కంటతడి పెట్టారు. ఈ సినిమాలోని సన్నివేశాలు ఎంతగా ప్రభావం చూపాయంటే ‘బలగం’ చిత్రాన్ని ఊర్లలో తెరపై ప్రదర్శించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఇంట్లో కూడా బలగం మూవీలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగింది..? .

బండి సంజయ్ అత్త చిట్ల విజయమ్మ ఇటీవల చనిపోయారు. ఈ క్రమంలో ఆయన ఆమె దశదిన కార్యక్రమంలో పాల్గొనడానికి కరీంనగర్ కు వచ్చారు. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో అర్ధరాత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు గురువారం రాత్రి బెయిల్ లభించగా జైలు నుంచి శుక్రవారం బయటకు వచ్చారు. ఆ తరువాత ఆయన తన అత్తమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరగాల్సిన కార్యక్రమాలను ఆయన చేతుల మీదుగా చేశారు.

Also Read: Selfie: దున్నపోతుతో సెల్ఫీ తీసుకునేందుకు జనం క్యూ.. ఎందుకంటే..?

అయితే అత్తమ్మ తనను కొడుకులాగా చూసుకునేదని కానీ ఆమె చనిపోయిన దగ్గరి నుంచి ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనలేకపోయానని అన్నారు. అంతేకాదు తాను రాలేదని ముద్ద కూడా పక్షులు ముట్టలేదని బండి సంజయ్ స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. బండి సంజయ్ చేసిన కామెంట్లు అచ్చంగా సినిమాలోని కాన్సెప్ట్‌తో మ్యాచ్ అవుతుండటంతో అందరూ బండి సంజయ్ ఇంట్లో బలంగం సినిమా సీన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.