దసరా (Dasara) పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లిన ఉద్యోగులు, విద్యార్థులు ఇప్పుడు తిరిగి నగరాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ముందుగానే హైదరాబాద్ (Hyderabad) చేరుకోగా, వీకెండ్ హాలిడేస్‌ను ఉపయోగించుకున్నవారు ఇవాళ ప్రయాణమయ్యారు. దీంతో నగరానికి వెళ్లే రోడ్లపై వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ పరిస్థితులు క్లిష్టంగా మారాయి.
YCP : ఏపీని బీహార్ తో పోల్చిన వైసీపీ
నలువైపుల నుంచి భాగ్యనగరానికి వచ్చే ప్రధాన రహదారులపై గణనీయమైన వాహనాల మూమెంట్ కనిపిస్తోంది. ముఖ్యంగా వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, విజయవాడ దిశల నుంచి వచ్చే నేషనల్ హైవేలపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రైళ్లలో కూడా బుకింగ్స్ ఫుల్ కావడంతో చాలా మంది బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించారు.
విద్యా సంస్థలు నిన్నే తిరిగి ప్రారంభమైనా ఇవాళ సెలవు రావడంతో చాలామంది సోమవారం నుంచి నగరాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. అందువల్ల ఆదివారం రోజునే ఎక్కువమంది సొంత ఊర్లకు వీడ్కోలు పలుకుతూ తిరిగి నగరాల బాట పట్టారు. రాబోయే వర్క్‌డేలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో రేపటినుంచి మరింత రద్దీ ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
