Site icon HashtagU Telugu

TS RTC : అయ్యప్ప భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్

Tsrtc Ayyappa

Tsrtc Ayyappa

అయ్యప్ప భక్తులకు (Ayyappa Devotees) టీఎస్‌ ఆర్టీసీ (TSRTC) గుడ్‌న్యూస్ తెలిపింది. గత కొద్దీ నెలలుగా టీఎస్‌ ఆర్టీసీ ప్రతి పండగకు, అలాగే విశేషమైన రోజులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను సంతోష పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా దసరా పండగకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచడమే కాకుండా ఎలాంటి అదనపు ఛార్జ్ వసూళ్లు చేయకుండా భారీ లాభాలు అందుకున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం మొదలుకాబోతుంది. కార్తీక మాసం అంటే అందరికి ముందుగా అయ్యప్ప స్వాములే గుర్తుకొస్తారు. కార్తీక మాసం లో లక్షలమంది అయ్యప్ప మాల ధరించి.. భక్తి శ్రద్ధలతో ఆ మణికంఠ స్వామిని ఆరాధిస్తారు. 41 రోజులు నియమ నిష్ఠలతో దీక్ష చేపట్టిన స్వాములు 41 రోజుల తరువాత శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ముడుపు చెల్లించి దీక్షను విరమిస్తారు. ఇందుకోసం ఇప్పటి నుండే ట్రైన్ , విమాన టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఒకవేళ టికెట్స్ లేని వారు ప్రవైట్ వాహనాలను బుక్ చేసుకుంటుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో అయ్యప్ప భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. శబరిమల (Sabarimala )కు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు (Super Luxury Buses) సమకూర్చేందుకు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో కరీంనగర్‌ (karimnagar) రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ ఎన్‌.సుచరిత మాట్లాడుతూ.. సుశిక్షితులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ.. టీఎస్‌ ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చనుందని తెలిపారు. కాగా ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీ సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. కాగా ప్రయాణంలో ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంటమనుషులకు, సామాన్లు సర్దేందుకు ఓ వ్యక్తికి ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

అలానే ఆర్టీసీ బస్సును అద్దెకు బుక్‌ చేసిన గురుస్వామికి ఉచిత ప్రయాణం ఉంటుందని.. అదే విధంగా ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్‌ చేసిన గురుస్వామికి ఆ బస్సులపై రోజుకు రూ.300 చొప్పున కమీషన్‌ కూడా ఇస్తామని వెల్లడించారు. కాగా శబరిమలకు వెళ్లే దారిలో ఇతర పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకునే వెసులుబాటు ఉంటుందని.. మరిన్ని వివరాలకు సమీపంలో డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆర్ఎం కోరారు.

Read Also : AP – Caste Census : కులగణనకు గ్రీన్ సిగ్నల్.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు