Site icon HashtagU Telugu

Avoid Traffic Challan : గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్లు వాడితే.. ట్రాఫిక్ ఛలాన్ల బెడదకు చెక్

Avoid Traffic Challan With Google Maps

Avoid Traffic Challan : ట్రాఫిక్ ఛలాన్లు తప్పించుకోవాలని భావించే వాహనదారులు గూగుల్ మ్యాప్స్‌ను వాడుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్‌ సాయంతో ట్రాఫిక్  ఛలాన్లను ఎలా తప్పించుకోవచ్చు.. అని ఆలోచిస్తున్నారా ? దీనికి సమాధానం దొరకాలంటే ఈ కథనం చదవాల్సిందే..

We’re now on WhatsApp. Click to Join

మన వాహనం స్పీడ్ లిమిట్​ దాటినా ట్రాఫిక్ ఛలాన్ జారీ అవుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనం అతివేగంగా నడపకూడదు. ఒకవేళ నడిపినా మనల్ని అలర్ట్ చేయడానికి గూగుల్ మ్యాప్స్‌లో స్పీడోమీటర్, స్పీడ్​ లిమిట్స్​ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు రియల్​-టైమ్​లో స్పీడ్​లిమిట్ సమాచారాన్ని డ్రైవర్లకు అందిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా మనం నిర్దిష్ట వేగంతో వాహనాన్ని డ్రైవ్(Avoid Traffic Challan) చేసేందుకు అవకాశం కలుగుతుంది. ఫలితంగా ఛలాన్ల బెడద తప్పుతుంది. అంతేకాదు.. రోడ్డు ప్రమాదాల రిస్కు కూడా తగ్గిపోతుంది.

Also Read :DSC Exam : డీఎస్సీ హాల్ టికెట్లపై అభ్యర్థుల ఆందోళన.. ఎందుకు ?

స్పీడ్​ లిమిట్ ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో మనం ఆన్ చేసుకుంటే.. మన వాహనం వేగం పరిమితికి మించితే అలర్ట్ చేస్తుంది. మనకు వార్నింగ్స్ జారీ చేస్తుంది. ఇది స్పీడ్ ఇండికేటర్ రంగులను మారుస్తుంది.హైవే‌పై మనం వాహనాలను కొంత వేగంగా నడపొచ్చు. కానీ లోకల్​ రోడ్లపై అతివేగం పనికిరాదు.  కొన్నిసార్లు మనం హైవే పైనుంచి లోకల్ రోడ్లపైకి ఎంటరయ్యాక కూడా స్పీడును తగ్గించం. అలాంటి సమయాల్లో అనవసరంగా ఛలాన్ కట్టాల్సి వస్తుంది. ఈ రిస్క్ నుంచి తప్పించుకోవాలంటే గూగుల్ మ్యాప్స్​లోని స్పీడోమీటర్​ ఫీచర్​ను ఎనేబుల్ చేసుకోవాలి. వాస్తవానికి ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు 2019 మే నెల నుంచే ఈ రెండు ఫీచర్లు(Google Maps) అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ 2 ఫీచర్లను ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. అధునాతన టెక్నాలజీని వాడుకొని డ్రైవింగ్ వేళ మన అతివేగానికి కళ్లెం వేసుకోవడం మంచి ఉపాయం.

Also Read :Tamil Nadu BSP Chief : ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు ప్రధాన నిందితుడి ఎన్‌కౌంటర్