ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) కు మొదటి షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. కర్ణాటక లో ఎలాగైతే ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిందో..అదే తరహా లో తెలంగాణ లో భారీగా ఉచిత హామీలు ప్రకటించి అధికారం చేపట్టింది. అందులో భాగంగా ముందుగా ఆరు గ్యారెంటీ హామీల (Congress 6 Guarantees) ఫై సీఎం రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజల్లో నమ్మకం కలిగించారు. ఆరు గ్యారెంటీ హామీల్లో భాగంగా ముందుగా మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి (Free Bus Travel For Women ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారభించబోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఎక్కడికంటే అక్కడికి ప్రయాణించవచ్చని , వయసుతో సంబంధం లేదని , ఏదైనా గుర్తింపు కార్డు ఉంటె సరిపోతుందని తెలియజేసారు. దీంతో మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆటోడ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలుచేస్తే ఆటో కార్మికుల బతుకుదెరువు ఎలా..? అని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్ ఆధారిత వాహనాలపై ఆధారపడి జీవనం చేస్తున్న డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడాల్సిందేనా అంటూ వారంతా వాపోతున్నారు. కాంగ్రెస్ ఆటో రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయడమో లేదా ఆటో కార్మికుల బతుకు దెరువుకు భరోసానివ్వడమో చేయాలని విన్నవించారు. అందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
Read Also : Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..