Site icon HashtagU Telugu

Free Bus Travel Scheme : కొత్తగూడెంలో బస్సు డ్రైవర్ ఫై దాడి చేసిన ఆటో డ్రైవర్లు

Autodrivers Attack Bus Driv

Autodrivers Attack Bus Driv

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యం..బస్సు డ్రైవర్లకు , కండక్టర్లకు చుక్కలు చూపిస్తుంది. గుర్తింపు కార్డు చూపించే విషయంలో మహిళలు కండక్టర్లతో గొడవకు దిగుతుంటే..మరోపక్క తమ స్టేజ్ వద్ద బస్సులు ఆపడం లేదని డ్రైవర్స్ తో గొడవకు దిగుతున్నారు. ఇక ఇప్పుడు ఆటో డ్రైవర్లు సైతం బస్సు డ్రైవర్స్ ఫై దాడికి దిగడం మొదలుపెట్టారు. ఈ ఘటన కొత్తగూడెం లో చోటుచేసుకుంది.

కొత్తగూడెం డిపో నుంచి ఖమ్మం బయల్దేరిన పల్లెవెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్ కూడలికి చేరుకుంది. అప్పటి వరకు స్థానిక సర్వీసు ఆటోల్లో వెళదామనుకున్న ప్రయాణికులంతా..బస్సు వచ్చేసరికి ఆటో దిగి.. ఒక్కసారిగా బస్సెక్కారు. అదే సమయంలో అక్కడున్న నలుగురు ఆటోడ్రైవర్లు ఆవేశంతో బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడిచేశారు. అతనిపై నీళ్లు చల్లుతూ అసభ్య పదజాలంతో దూషించారు. కండక్టర్ సరస్వతి, ప్రయాణికులు వారించే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. ప్రస్తుతం దీనిపై విచారణ మొదలుపెట్టారు పోలీసులు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ ఘటన ఫై TSRTC ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ‘ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్లైన సిబ్బందిని దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది’ అని వార్నింగ్ ఇచ్చారు.

మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కారణంగా తమకు ఉపాధి లేకుండా పోయిందని, కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ ఈ స్కీమ్ మొదలైన మొదిటిరోజు నుంచే ఆటోవాలలు పలు చోట్లు ధర్నాలకు దిగారు. ప్రభుత్వం తమకు ప్రత్యాన్మయం చూపించాలని కోరుతున్నారు. అయితే దీనిపై ఇప్పటికే స్పందించిన రేవంత్ సర్కార్ తప్పకుండా ఆటోవాలలకు న్యాయం చేస్తామని, దీనిపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అంతేకాదు ఆరు గ్యారంటీల అమలు దరఖాస్తు ఫారమ్ బుధవారం సచివాలయంలో విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ ఆటోవాలల ఇష్యూను పరిగణలోకీ తీసుకుంటామని మాటిచ్చారు. ఇంతలోనే ఆటో డ్రైవర్లు బస్సు సిబ్బంది ఫై దాడికి దిగడం చేస్తున్నారు.

Read Also : PM Modi To Russia: ప్రధాని మోదీని రష్యాకు ఆహ్వానించిన అధ్యక్షుడు పుతిన్..!