Site icon HashtagU Telugu

Telangana: తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్య

Telangana

Telangana

Telangana: తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

వికారాబాద్ లోని ధరూరు గ్రామానికి చెందిన ఆటోరిక్షా డ్రైవర్‌ అమీర్‌ఖాన్‌ (21) పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమీర్ ఖాన్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఖాన్ రెండు పూటలా చేయలేక అప్పుల పాలయ్యాడు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఉపాథి తగ్గిపోతుందని వాపోతున్నారు. ఈ క్రమంలోనే వరుస ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా వరుసగా ఆటోరిక్షా డ్రైవర్లు ఆత్మహత్యలతో మరణిస్తున్నా ప్రభుత్వం పర్యవేక్షణ లేదని స్థానికులు మండిపడుతున్నారు. అటు రాజకీయంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ఆటోరిక్షా డ్రైవర్లకు ఏటా రూ.12 వేల సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లు ప్రకటించినా నేటికీ ఏదీ రూపుదిద్దుకోలేదని విమర్శలు లేవనెత్తుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోరిక్షా డ్రైవర్ల కష్టాలకు ప్రభుత్వమే కారణమంటూ రెండు రోజుల క్రితం ఆటోరిక్షాల్లో అసెంబ్లీకి వెళ్లి తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.

Also Read: Ayodhya : అయోధ్య లో రెచ్చిపోతున్న దొంగలు..