Site icon HashtagU Telugu

TRS MLA Trap: `నోటుకు ఎమ్యెల్యే` కేసులో అనుమానాలెన్నో `నరసింహా`!

Bandi

Bandi

`నోటుకు ఎమ్యెల్యే` కేసు లోని పలు కోణాలు ఆసక్తిని రేపుతున్నాయి. నిజంగా నాలుగు ఎమ్యెల్యేను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేసిందా ? నిజం అనుకుంటే ఆ నలుగురితోఆ పార్టీ కి వచ్చే లబ్ది ఏమిటి? పోనీ ఆ నలుగురు తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసే సత్తా ఉన్న వాళ్ళా ? అంటే అదే కాదు . పోలీస్ రైడింగ్లో 100 కోట్లు అని కొద్దీ సేపు కాదు 15 కోట్లు దొరికాయని మరికొంత సేపు కెసిఆర్ సొంత మీడియా బాకా ఊదింది. సీన్ కట్ చేస్తే ఒక్క రూపాయి కూడా దొరకలేదని ఏసీబీ కోర్టుకు పోలీస్ నివేదిక ఇచ్చింది. అంటే ఏమి లేకుండా బీజేపీని అభాసుపాలు చేయడానికి గతంలో చంద్రబాబు మీద చేసిన ట్రిక్ ను కెసిఆర్ ప్లే చేశారా? అంటే కాదనకుండా ఉండలేము. ఎందుకంటె బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేయడానికి సిద్ధం అయినప్పటికీ తెరాస మౌనంగా ఉంది. అంతే కాదట , మౌనంగా ఉండాలని మంత్రి కెటీఆర్ లీడర్, క్యాడర్ కు ఆదేశం ఇచ్చారట .

Also Read:   Bandi Sanjay : కేసీఆర్ కు సిగ్గుంటే…మునుగోడు పోటీ నుంచి తప్పుకోవాలి..!!

ఇక తెల్లారే సరికి మరో రూమర్ బయలు దేరింది. గురువారం రాత్రి కోర్టులో నలుగురు నిందితులను ప్రవేశపెట్టే ముందే కేంద్రం , రాష్ట్రము మధ్య కేసుల ఒప్పందం కుదిరిందని టాక్ . కేసుకు, కేసుకు చెల్లు మాదిరిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి కవితను తప్పిస్తే , నోటుకు ఎమ్యెల్యే కేసు నుంచి బీజేపీ లీడర్ లను కాపాడేలా అంగీకారం కుదిరిందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం. ఇదంతా బీజేపీ , తెరాస ఆడుతున్న మునుగోడు ఉప ఎన్నిక చీప్ గేమ్ గా కాంగ్రెస్ కొట్టి పడేస్తుంది. ఒక వేళా తప్పుడు గా రైడ్ జరిగితే పోలీస్ మీద బీజేపీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తుంది. నిజంగా కెసిఆర్ మాట విని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రైడ్ చేసి ఉంటే కేంద్రం ఆయన మీద చర్యకు తీసుకుంటారని సహజంగా వచ్చే అనుమానం. ఇంకో వైపు తప్పు రైడింగ్ చేయటంతో పాటు, బీజేపీ నైతికతను దెబ్బతీసేలా కెసిఆర్ ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టు లో బీజేపీ పిటిషన్ వేసింది. ఇదంతా చూస్తుంటే కెసిఆర్ తప్పుడు పని పోలీస్ చేత చేయించారని ఎవరైనా అనుకుంటారు.

కేసు నిజమే , కానీ పరస్పర అవగాహన బీజేపీ, టీ ఆర్ ఎస్ మధ్య జరిగిందని కాంగ్రెస్ చెబుతుంది. రాజకీయ క్రీడా పైకి కనిపిస్తున్నప్పటికీ లోపల అంతా రెండు పార్టీ లు కేసుకు కేసు చెల్లు పెట్టుకున్నాయని నమ్ముతుంది. అదే నిజం అయితే స్టీఫెన్ రవీద్ర మీద బదలీ వేటు ఉండదని మరో వాదన వినిపిస్తుంది. ఆ కేసు లో ఫేక్ రైడ్ జరిగి ఉంటె మాత్రం స్టీఫెన్ ఫై వేటు ఖాన్ అంటూ ప్రచారం జరుగుతుంది.
ఇంకో వైపు మరో ప్రచారం కూడా ప్రజల్లో ఉంది. ఆ నలుగురు ఎమ్యెల్యేలు టీ ఆర్ ఎస్ ను వీడేందుకు సిద్ధం అయ్యారని తెలిసి కెసిఆర్ ఆడించిన గేమ్ గా చెప్పుకుంటున్నారు. నిజానిజాలు ఓటు కు నోటు కేసు లో మాదిరిగా ఈ కేసులోనూ సమాధి కావడం ఖాయంగా కనిపిస్తుంది.

Also Read:  Yadagirigutta Temple: యాదగిరిగుట్ట ఆలయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచండి..!

నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కార్యకర్తలుగా చిత్రీకరించి ముగ్గురు వ్యక్తులు వేటాడిన కేసులో న్యాయమైన విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ గురువారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.ప్రభుత్వ జోక్యం లేని హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తన పిటిషన్‌లో కోర్టును కోరారు.బుధవారం కూడా ప్రసారమైన అజీజ్‌నగర్‌ ఫామ్‌హౌస్‌లో అక్రమాస్తుల కేసు చుట్టూ తిరుగుతున్న వాస్తవాలు, ఉద్దేశాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బిజెపి ప్రతిష్టను దిగజార్చడం మరియు దాని నాయకులను విలన్‌లుగా ముద్రించాలనే ఏకైక ఉద్దేశ్యంతో మరియు సైబరాబాద్ పోలీసు కమిషనర్ క్రియాశీల మద్దతుతో, ముగ్గురు బిజెపి వ్యక్తులు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారని ఫిర్యాదుదారు మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఫిరాయింపులకు ప్రతిఫలంగా ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.100 కోట్లు చెల్లిస్తోందని పోలీసు అధికారులు ఎలా నిర్ధారిస్తున్నారో చెప్పాలన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం, కోర్టు తన అసాధారణమైన మరియు ప్లీనరీ అధికారాలను ఉపయోగించుకోవచ్చని మరియు విశ్వసనీయతను అందించడానికి మరియు దర్యాప్తుపై విశ్వాసం కలిగించడానికి అవసరమైనప్పుడు తటస్థ ఏజెన్సీ ద్వారా కేసును విచారించమని ఆదేశించవచ్చని ఆయన పిటిషన్ లో పొందుపరిచారు. శుక్రవారం విచారణకు రానున్న ఈ రిట్‌ పిటిషన్‌లో ప్రధాన కార్యదర్శి (హోమ్‌), డీజీపీ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, ఏసీపీ రాజేంద్రనగర్‌, సీబీఐ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టీఆర్‌ఎస్‌కు చెందిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ప్రతివాదులుగా ఉన్నారు. మొత్తం మీద ఈ కేసు సవాలక్ష అనుమానాలకు తావిస్తోంది.

Also Read:   PM Modi: కాంతార సినిమా చూడనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..?