సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ (Secunderabad Railway Police Station) పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మేడ్చల్‌కి వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతి (23) ఒంటరిగా ప్రయాణిస్తుండగా, ఓ యువకుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి (Rap Attampet) పాల్పడ్డాడు. తనను కాపాడుకునే ప్రయత్నంలో ఆ యువతి నడుస్తున్న రైలు నుంచి దూకేసింది. ఈ ఘటన కొంపల్లి సమీప రైలు బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో, వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Chennai Super Kings: పోరాడి ఓడిన ముంబై.. శుభారంభం చేసిన చెన్నై!
పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్ లోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి, తన సెల్‌ఫోన్ రిఫేరింగ్ కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. తిరిగి మేడ్చల్‌కి బయలుదేరే సమయంలో మహిళల కోచ్‌లో ఎక్కింది. అయితే మార్గమధ్యంలో ఇతర మహిళా ప్రయాణికులు దిగిపోవడంతో, ఆమె ఒక్కరే మిగిలిపోయింది. ఇదే ఆసరాగా తీసుకుని ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డాడు. అతడి నుండి తప్పించుకునేందుకు యువతి రైలు నుంచి దూకడం వల్ల తీవ్రంగా గాయపడింది.
Chennai Super Kings: పోరాడి ఓడిన ముంబై.. శుభారంభం చేసిన చెన్నై!
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మహిళా ప్రయాణికుల భద్రతపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. రైల్వే కోచ్‌లలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని, నేరస్తుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మిగతా ప్రయాణికులు కోరుతున్నారు.