హైదరాబాద్లోని నాంపల్లి(Nampally)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం (BJP Office) పై యూత్ కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడం తో.. కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు గాంధీభవన్ (Gandhi Bhavan) ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా వారు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి ముందుకు దూసుకెళ్తున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ ఏంజరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.
Prashant kishore : క్షీణించిన ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం..ఆసుపత్రికి తరలింపు..!
తాజాగా ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిదురి ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు బిజెపి – కాంగ్రెస్ పార్టీల మధ్య రగడ మొదలైంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గలలా తయారుచేస్తామని రమేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిజెపి నేతల తీరు పై నిరసనలు చేస్తున్నారు. మంగళవారం నాంపల్లి లోని బిజెపి కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు.
ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. దీనితో వారిని ఆసుపత్రికి తరలించారు. మరోపక్క రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు మరింత వేడెక్కించాయి. బిజెపి కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, తాము తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ తగలబెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇప్పుడు బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముట్టడికి వెళ్లారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.