Site icon HashtagU Telugu

High Tension at Khammam : హరీశ్ రావు వాహనంపై రాళ్ల దాడి

Attack On Harishrao

Attack On Harishrao

ఖమ్మం పట్టణం (Khammam )లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శించే క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి (Attack On Harish Rao Car )కి పాల్పడ్డారు. కారులో హరీశ్ రావు, సబితా, నామా నాగేశ్వరరావు ఉన్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంచికంటి న‌గ‌ర్‌లో బీఆర్ఎస్ నేత‌లు ప‌ర్య‌టిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాంగ్రెస్ శ్రేణుల దాడిలో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త సంతోష్ రెడ్డికి తీవ్ర గాయాల‌య్యాయి. అత‌న్ని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సాయం చేయలేదని ప్రశ్నించిన తమపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. వరదల్లో 28 మంది చనిపోతే కేవలం 16 మంది చనిపోయారని చెప్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. వరదలు వచ్చిన రోజు సీఎం ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. భారీ వ‌ర్షాల‌కు ఖ‌మ్మం జిల్లాలో తీవ్ర‌మైన న‌ష్టం జ‌రిగింది. సూర్యాపేట‌, ఖ‌మ్మం, కొత్త‌గూడెం, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో వ‌ర్షాల వ‌ల్ల జ‌న‌జీన‌వం అత‌లాకుల‌త‌మైంది. భారీగా ప్రాణ, ఆస్తి, పంట న‌ష్టం జ‌రిగింది. వ‌ర‌ద‌ల విష‌యంలో ప్ర‌భుత్వం దారుణంగా విఫ‌ల‌మైంది. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం స‌కాలంలో స్పందించ‌క‌పోవ‌డం వ‌ల్ల, ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్రాణ, ఆస్తి న‌ష్టం పెద్ద ఎత్తున జ‌రిగిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుకమేటలు పెట్టిన ప్రాంతాల్లో రూ.50వేల పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని దుయ్య బట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలన్నారు.

Read Also : IIT Bombay : 25 శాతం ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్లకు నో ప్లేస్‌మెంట్స్