తెలంగాణ లో హ్యాట్రిక్ విజయం సాధించాలని గులాబీ బాస్ పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (TRS) రెండుసార్లు అధికారం చేపట్టింది. అనేక సంక్షేమ పథకాలను అందజేసి ప్రజల మెప్పు పొందింది. ఈసారి కూడా అలాంటి సంక్షేమ పథకాలతో ప్రజలు మనసులు గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో ఈ ఎన్నికల తాలూకా మేనిఫెస్టో ను గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) నిన్న ఆదివారం ప్రకటించారు. ఈ మేనిఫెస్టో ఫై రకరకాల స్పందనలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ హామీలను కాపీ కొట్టారని ఆరోపిస్తుంటే..కాంగ్రెస్ హామీలు చిత్తూ కాగితాలతో పోలుస్తున్నారు బిఆర్ఎస్ నేతలు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో బిఆర్ఎస్ మేనిఫెస్టో ఫై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అద్బుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. పేదల ప్రజల కోసం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని, బీఆర్ఎస్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మరోసారి తేల్చిచెప్పారు. గత పదేళ్లల్లో పేదల కోసం కేసీఆర్ అనేక మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, వాటి వల్ల లక్షల మంది లబ్ధి పొందారని ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సీఎం అవుతారని, ఆయనను మరోసారి గెలిపించాలని ప్రజలకు ఓవైసీ సూచించారు. కాంగ్రెస్-బీజేపీ దొందూ దొందే అని ఓవైసీ విమర్శలు కురిపించారు.
బిఆర్ఎస్ మేనిఫెస్టో హైలైట్స్ (BRS Manifesto HIGHLIGHTS):
- సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ. 3 వేల గౌరవ వేతనం
- దివ్యాంగులు పెన్షన్లు రూ. 6 వేలకు పెంపు
- ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు పెంపు
- రైతుబంధు కింద ఇస్తున్న రూ.10 వేల నగదు సాయాన్ని 16 వేలకు పెంపు (అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో రూ.12 వేలు.. ఆ తర్వాత క్రమంగా పెంపు)
- బీసీలకు అమలు చేస్తున్న పథకాలు అలాగే కొనసాగింపు
- దళితబందు పథకం యథావిధిగా కొనసాగింపు
- గిరిజనేతరులకు కూడా పోడు భూములు ఇచ్చే అంశం పరిశీలిస్తాం.
- ఆరోగ్యశ్రీ పథకం రూ. 15 లక్షల పెంపు
- అర్హులైన వారందరికీ రూ. 400కే సిలిండర్, అక్రిడేషన్ ఉన్న జర్మలిస్టులకు కూడా రూ. 400కే సిలిండర్
- తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం
- ‘కేసీఆర్ బీమా ప్రతి ఇంటిటి ధీమా’ పేరుతో రూ. 5 లక్షల బీమా పథకం (93 లక్షల మందికి లబ్ధి)
- హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు
- ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ డిమాండ్‌పై కమిటీ ఏర్పాటు
- లంబాడీ తండాలు, గోండు గూడేలను పంచాయతీలను చేస్తాం.
- అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారికి భూ హక్కులు
- ఇంటి స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు
Read Also : KCR Jangaon Public Meeting : జనగాం జిల్లా ఫై హామీల వర్షం కురిపించిన కేసీఆర్