Site icon HashtagU Telugu

Telangana Polls 2023 : రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ – అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi Revanth

Asaduddin Owaisi Revanth

తెలంగాణ పోల్స్ (Telangana Polls 2023) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలు ఒకరి ఫై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ (BRS) – కాంగ్రెస్ (Congress) మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా..తాజాగా రేవంత్ రెడ్డి (Congress chief Revanth Reddy) ఫై అసదుద్దీన్ ఒవైసీ (AIMIM chief Asaduddin Owaisi ) ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూడా అలాగే మద్దతు ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ , బిజెపి పార్టీలు ఎంఐఎం ఫై విరుచుకపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ నేత రేవంత్ సైతం అలాంటి ఆరోపణలే చేస్తూ వస్తున్నారు.తాజాగా ఆయన మాట్లాడుతూ..కర్ణాటక ఎన్నికల సమయంలో మోడీ, అమిత్ షా సన్నిహితుడికి ఒవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. దీనిపై దర్గా దగ్గరికి రమ్మన్నా.. భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గరకి రమ్మన్నా వస్తాను.. మరి మసీదులో ప్రమాణం చేసేందుకు అసదుద్దీన్ ఒవైసీ రెడీనా అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఆయన ఒంటిపై షెర్వాణీ ఫైజామా ఉందని అనుకున్నా.. కానీ షెర్వాణీ కింద ఖాకీ నిక్కర్ కూడా ఉందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ..రేవంత్ ఫై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ అని , తమపై విమర్శలు చేయడానికి మీకు ఏమీ లేదు.. మీరు మా బట్టలు, గడ్డాల గురించి మాట్లాడి మాపై దాడులు చేస్తున్నారని ఓవైసీ వ్యాఖ్యనించారు. దీనినే డాగ్ విజిల్ పాలిటిక్స్ అంటారు అంటూ తెలిపారు. నీవు ఆర్‌ఎస్‌ఎస్ కీలుబొమ్మవి.. ఇందులో బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి తేడా లేదని అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. పీసీసీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడిగా చడ్డీ కట్టుకుని ఏబీవీపీకి వెళ్లి.. అక్కడి నుంచి టీడీపీలోకి.. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు అంటూ ఓవైసీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గాంధీ భవన్‌ను మోహన్ భగవత్ స్వాధీనం చేసుకున్నారు.. ఆయన ఎలా కావాలంటే అలా కాంగ్రెస్‌ను నడిపిస్తారని ఎవరో సరిగ్గా చెప్పారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఓవైసీ షేర్వానీ గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ కూడా అదే పని చేశారని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు.

Read Also : Bandla Ganesh : బండ్ల గణేష్ ఫై అయ్యప్ప భక్తులు ఆగ్రహం..