Site icon HashtagU Telugu

Manikrao Thackeray: నేడు హైదరాబాద్‌కు మాణిక్‌రావ్ ఠాక్రే

Manikrao Thackeray

Revnth

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కొత్తగా నియమితులైన మాణిక్‌రావ్ ఠాక్రే (Manikrao Thackeray) ఆ హోదాలో తొలిసారిగా బుధవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్ రావు ఠాక్రే బుధవారం మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఠాక్రే గాంధీభవన్‌లో వివిధ స్థాయి నేతలతో భేటీ అవుతారు. తొలి రోజు AICC ఇన్​చార్జ్ సెక్రటరీలు, PCC చీఫ్, CLP నేతతో విడివిడిగా మాట్లాడతారు. తర్వాత సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లను కలుస్తారు.

బుధవారం ఉదయం 9.30 గంటలకు చేరుకుని నేరుగా గాంధీభవన్‌కు చేరుకుంటారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ సెక్రటరీతో ఠాక్రే వేర్వేరుగా సమావేశమవుతారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, పార్టీ సీనియర్లతో జరిగే సమావేశంలోనూ, రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో జరిగే మరో సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆఫీస్ బేరర్లతో కూడా సమావేశం కానున్నారు.

Also Read: Special Shows: వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు శుభవార్త.. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతి

గురువారం ఆయన డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో కూడా సమావేశం కానున్నారు. మరోవైపు ఈ నెల 26 నుంచి హత్ సే హత్ జోడో యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్రపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కాగా.. తెలంగాణలో కూడా కుల గణన నిర్వహించాలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సీఎం కేసీఆర్‌ను కోరారు. 17న నాగర్ కర్నూల్ లో దళిత, గిరిజనుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్ లాల్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు.