Site icon HashtagU Telugu

CM Revanth : రేవంత్ రెడ్డి ఫై ఏపీ మంత్రి ప్రశంసలు

Keshav

Keshav

తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి ఫై విమర్శలు చేస్తుంటే..పక్క రాష్ట్ర మంత్రులు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. శుక్రవారం ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా రేవంత్ ఫై ప్రశంసలు కురిపించారు.

తెలంగాణ(Telangana)లో సీఎం రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుందని, ఎప్పటికైన ముఖ్యమంత్రినే(Chief Minister) అవుతానని గతంలో చాలా సార్లు తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌కు లొంగలేదు కాబట్టే రేవంత్ రెడ్డిని ప్రజలు ప్రత్యామ్నాయంగా (Alternatively) చూశారని కేశవ్ చెప్పుకొచ్చారు. ఇదే సందర్బంగా హైడ్రా ఫై కూడా కేశవ్ కామెంట్స్ చేసారు. పెద్దోళ్లను కొడితే కింది వాళ్ళు సంతోషిస్తారని..హైడ్రా విషయంలో కూడా అదే జరుగుతుందన్నారు. మొదట చిన్న వాళ్లను సంతృప్తి పరచాలని అన్నారు.

తెలంగాణ ఎప్పుడు చైతన్యవంతమైన రాష్ట్రం అని , తెలంగాణలో ఏదో ఒక యాక్టివిటీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమల ప్రాశస్త్యం గురించి జగన్‌ మాట్లాడటం మన ఖర్మ అన్నారు. తిరుమలలో పటిష్టమైన విధానాన్ని వైసీపీ ఎక్కడ ఉంచిందని ప్రశ్నించారు. ఆ వ్యవస్థను చెడగొట్టారు కాబట్టే కల్తీ జరిగిందన్నారు. మీరు ఎంత చెప్పినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని మంత్రి పయ్యావుల విమర్శించారు.

Read Also : Mahesh Kumar : మోడీ దేవుళ్ళ పేరుతో ఓట్ల బిక్షాటన చేస్తుండు – PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్