Telangana New Ration Card : ఈ నెల 28 నుండి కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులు ప్రారంభం

తెలంగాణ (Telangana) ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరపడబోతుంది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల (New Ration Card) దరక్షతుల స్వీకరణ కార్యక్రమం మొదలుకాబోతుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు ఒకసారి మాత్రమే నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రక్రియ గత ప్రభుత్వం చేపట్టలేదు. కేవలం కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త […]

Published By: HashtagU Telugu Desk
Telangana New Ration Card

Telangana New Ration Card

తెలంగాణ (Telangana) ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరపడబోతుంది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల (New Ration Card) దరక్షతుల స్వీకరణ కార్యక్రమం మొదలుకాబోతుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు ఒకసారి మాత్రమే నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రక్రియ గత ప్రభుత్వం చేపట్టలేదు. కేవలం కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

నూతన రేషన్‌ కార్డుల అప్లికేషన్లను మీసేవా ద్వారా ఆన్‌లైన్‌లో తీసుకుంటారు. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్‌ చేశాక ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేస్తారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామసభలు.. నగరాలు, పట్టణాల్లో బస్తీసభల ద్వారా జరుగుతుంది. ఈ ప్రాసెస్‌ చూడటం కోసం ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను ప్రభుత్వం నియమించనుంది. ఇక కొత్త రేషన్ కార్డు దారులు కేవలం రేషన్‌ కోసమే కాకుండా.. ఆ కార్డు ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు మ్యాండేటరీగా ఉండడంతో ఈ కార్డ్స్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని సైతం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడంతో మరింత ఆసక్తి పెరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 6 లక్షల 47 వేల 297 రేషన్‌కార్డులు జారీచేసింది గత ప్రభుత్వం. రాష్ట్రంలో ఇంతవరకు మొత్తం 2.82 కోట్ల మందికి పైగా రేషన్‌ లబ్ధిదారులు ఉన్నారు. అలాగే రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు.. తప్పులను సరిచేయడానికి సైతం ఈనెల 28వ తేదీ నుంచి అవకాశం కల్పించనున్నారు.

Read Also : Congress : మల్కాజ్‌గిరి లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే – తుమ్మల

  Last Updated: 23 Dec 2023, 03:45 PM IST